అమెరికాలో రాజ్‌తో స‌మంత చిల్‌.. ఇక అదొక్కటే బ్యాలెన్స్‌!

admin
Published by Admin — July 09, 2025 in Movies
News Image

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ లో ఉన్నారని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ సమయంలో సమంత, రాజ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారిందని.. త్వరలోనే రాజ్, సమంత ఏడడుగులు వేయడం ఖాయమని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజ్ తో క‌లిసి పదేపదే సామ్ దర్శనమిస్తోంది. ఎక్క‌డికెళ్లిన రాజ్ ను వెంట పెట్టుకుపోతోంది.

రీసెంట్ గా తానా స‌భ‌ల కోసం సమంత అమెరికా వెళ్లింది. అయితే సింగిల్ గా కాదు.. రాజ్ కూడా ఆమె వెంటే వెళ్లాడు. తాజాగా అమెరికా డెట్రాయిట్ లో రాజ్ తో క‌లిసి స‌మంత ఫుల్ గా చిల్ అయింది. వెకేష‌న్ కు సంబంధించిన ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత త‌న ఫాలోవ‌ర్స్ తో పంచుకుంది.  అయితే  ఓ ఫొటోలో స‌మంత, రాజ్ ఒక‌రి మీద‌ ఒక‌రు చేయి వేసుకుని న‌వ్వుతూ న‌డుస్తుండ‌గా, మ‌రో ఫొటోలో ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌న కూర్చొని ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ లో క‌నిపించారు.

ఈ యునిక్ పిక్స్ ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. రాజ్, స‌మంత‌లను మ‌రోసారి జంట‌గా చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంది. పైగా ఈసారి ఇద్ద‌రూ మ‌రింత క్లోజ్ గా క‌నిపించ‌డంతో.. రాజ్ తో సమంత త‌న రిలేష‌న్ లో క‌న్ఫార్మ్ చేసేసింద‌ని, ఇక పెళ్లి ఒక్క‌టే బ్యాలెన్స్ అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. కాగా, రాజ్ కు ఆల్రెడీ పెళ్లై ఒక కూతురు ఉంది. అయితే రాజ్ త‌న మొద‌టి భార్య‌కు దూరంగా ఉంటున్నాడ‌ని.. త్వ‌ర‌లో వీరికి విడాకులు రానున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

https://www.instagram.com/p/DL2sTiXo2Sh/?utm_source=ig_web_copy_link&igsh=dm1uMDdidG5teHMz

Tags
Samantha Ruth Prabhu Raj Nidimoru Tollywood Latest News Samantha Vacation Pics
Recent Comments
Leave a Comment

Related News