ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు. గతంలో రాష్ట్ర పార్టీకి చీఫ్‌గా కూడా పనిచేశారు. అదేసమయంలో మంత్రిగా కూడా పనిచేశారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే కిమిడి కళా వెంకట్రావు. ప్రస్తుతం విజయనగరం జిల్లా.. చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఎక్కడా సంతృప్తితో లేరన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని కూడా ఆయన వగరుస్తున్నారని అంటున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయినా.. మౌనంగానే ఎదుగుతున్నారట. ప్రజలకు చేరువ అవుతున్నానని ఆయనే స్వయంగా చెబుతు న్నారు. ఇక, ఈ మాజీ మంత్రి అసంతృప్తి విషయానికి వస్తే.. తనకు ఇష్టంలేని నియోజకవర్గం ఇవ్వడం.. ప్రధానంగా ఆయనను ఇరకాటంలోకి నెట్టింది. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకాగా చెప్పే చీపురుపల్లిలో కిమిడి రాజకీయాలు ముందుకు సాగకపోవడానికి బొత్స వర్గం బలంగా ఉండడమే కారణమని తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు.
అంతేకాదు.. మనసు మొత్తం.. ఎచ్చెర్లపైనే ఉందని కూడా కిమిడి అనుచరులు చెబుతున్నారు. ఎచ్చెర్ల కిమిడి ఇలాకా. ఇక్కడ ఆయన రాజకీయాలు కొట్టిన పిండి. అయితే.. గత ఎన్నికల్లో మార్పులు , చేర్పుల కారణంగా.. నియోజకవర్గాల నుంచి దూరం జరగాల్సి వచ్చింది. దీంతో అటు చీపురుపల్లిలో పనులు కాక.. ఇటు ఎచ్చర్లలోనూ తన హవా తగ్గుతుండడంతో మాజీ మంత్రి కిమిడి మనస్తాపంలో ఉన్నారని తెలుస్తోం ది. అయితే.. ఆయన ఎమ్మెల్యేగా పనులు మాత్రం చేసుకుంటున్నారు. ప్రజలకు చేరువగానే ఉంటున్నారు.
కానీ.. ఫుల్లు మౌనంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఉన్న దూకుడు(వివాద రహిత) ఇప్పుడు లేదనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీ తరఫున పెద్దగా వాయిస్ వినిపించడం లేదు. తనకు మంత్రి పీఠం వస్తుందని ఆశించినా.. సామాజిక వర్గ సమీకరణలు సహా.. మరికొన్ని అంతర్గత కారణాలు కూడా.. కిమిడిని దూరంగా పెట్టాయి. ఇక, వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ జాబితాలోనూ కిమిడి పేరు వినిపిస్తోం ది. అయితే.. 2019లో పార్టీని విజయతీరం వైపు నడిపించకపోవడమే ఆయనకు ప్రధాన మైనస్ అయింద న్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా.. కిమిడి ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.