కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. నిజమా? అని అనిపించేలా కూడా ఉంటాయి. అలాంటిదే వైసీపీలోనూ జరుగుతోంది. వైసీపీలో ఉండి.. ప్రత్యర్థులకు మేలు చేస్తున్న వారి జాబితా ఎక్కువగా ఉందని వైసీపీ నాయకులు పసిగట్టారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి కూడా తీసుకు వెళ్లారు. దీంతో వారిపై వేటు వేయాలని నిర్ణయించిన జగన్ ఇప్పటికే ఇద్దరిపై వేటు వేశారు. హిందూపురం నియోజకవర్గం నేత లు.. నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డిలపై జగన్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
అయితే..ఇప్పుడు ఈ జాబితాలో మరింత మంది ఉన్నారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత పదే పదే చెబుతున్నారు. ``మనం టీడీపీపై పోరాటం చేస్తు న్నాం. మీరు ఆ పార్టీ నాయకులతో చేతులు కలుపుతున్నారు. ఇంక మనకు పోరాటాలు చేయడం ఎందు కు? జనం మనల్ని ఎలా చూస్తారు?`` అని గత మూడు మాసాల కిందటే అంతర్గత సమావేశంలో జగన్ చెప్పుకొచ్చారు. అయినా.. కొందరు నాయకులు మాత్రం తమ తీరును ఏ మాత్రం మార్చుకోలేదు.
ప్రధానంగా.. ఇసుక, మద్యం, గనుల వ్యవహారాల్లో వైసీపీ నాయకులు కొందరు టీడీపీ నాయకులతో చేతు లు కలిపారన్నది వాస్తవం. దీనిని టీడీపీ కూడా తీవ్రంగా పరిగణించినా.. తర్వాత కాలంలో కొన్ని కారణాల తో చూసీ చూడనట్టు వ్యవహరించింది. అయితే.. వైసీపీ మాత్రం టీడీపీ అంటేనే సీరియస్‌గా వ్యవహరిస్తు న్న విషయం తెలిసిందే. గతంలో కూడా.. టీడీపీకి అనుకూలంగా ఉన్నారని.. చాలా మందిని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది.
కానీ, కొందరు నాయకులు మాత్రం పార్టీలైన్‌ను.. పార్టీ అధినేత ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలోనే జగన్ ఇలాంటి వారిపై సీరియస్‌గా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురు కీలక నేతలపై గుర్రుగా ఉన్నారన్నది పక్కాగా వెల్లడైన అంశం. ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. కానీ, వ్యాపారాలు, వ్యవహారాల్లో మాత్రం చేతులు కలుపుతున్నారు. ఇది గతంలోనూ ఉంది. కానీ, దీనిని వదులు కోవాలని జగన్ చెబుతున్నారు. అయినా..వారు వదులు కోవడం లేదు. ఈ పరిణామాల క్రమంలో రాబోయే రోజుల్లో ముగ్గురు నుంచి నలుగురు వరకు కీలక నేతలకు రాం రాం చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.