ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు చాలా కామన్ అయిపోయాయి. కలిసి బాధపడుతూ ఉండే కన్నా విడిపోయి సంతోషంగా ఉండడమే మేలు అన్న ఫార్ములాను సినీ తారలు బాగా ఫాలో అవుతున్నారు. అయితే ప్రముఖ స్టార్ హీరోయిన్ హన్సిక కూడా విడాకుల బాటలో నడవబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ స్టార్డమ్ సంపాదించుకున్న హన్సిక.. 2022 డిసెంబర్ 4న సోహైల్ ఖతురియాను పెళ్లాడింది.
అయితే సోహైల్‌కు ఇది రెండో వివాహం. మొదట ఆయన హాన్సిక చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లికి హాన్సిక కూడా హాజరైంది. అయితే రింకీ బజాజ్, సోహైల్ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. పెళ్లైన కొద్ది రోజులకే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్ హాన్సికకు దగ్గర కావడం, ఇద్దరూ ప్రేమలో పడటం.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
వివాహం అనంతరం ఏడాది పాటు ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపించారు. సోహైల్‌తో ఏ వెకేషన్ కు వెళ్లిన అందుకు సంబంధించిన ఫోటోలను హన్సిక సోషల్ మీడియాలో పంచుకునేది. మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక ఫోటోలు కూడా హన్సిక షేర్ చేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరూ కలిసి కనిపించడం మానేశాడు. ఇన్‌స్టాలో హన్సిక తన సింగిల్ ఫోటోలను మాత్రమే పంచుకుంటోంది. పైగా రెండేళ్ల నుంచి హన్సిక భర్తకు దూరంగా తన తల్లి ఇంట్లోనే ఉంటుందని, అలాగే సోహైల్ తన పేరెంట్స్ తో ఉంటున్నాడన్న లీకులు బయటకు వచ్చాయి. దీంతో విడాకులు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
హన్సిక తన వైవాహిక బంధానికి స్వస్థి పలకనుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇలాంటి సమయంలో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోహైల్ తన పర్సనల్ లైఫ్‌పై రియాక్ట్ అయ్యాడు. విడాకులు అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని.. అవి కేవలం పుకార్లే అని సోహైల్ తేల్చి చెప్పాడు. కానీ విడివిడిగా ఎందుకు ఉంటున్నారు అన్న విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిణామాల నడుమ విడాకుల వార్తలపై హన్సిక ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.