అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తో తనకు చేదు అనుభవం ఎదురైందంటూ అమెరికన్ నటి మారియా ఫార్మర్ హెడ్‌లైన్స్ లో నిలిచారు. జెఫ్రీ ఎప్స్టీన్ మరియు గిస్లైన్ మాక్స్వెల్ సెక్స్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన మహిళల్లో మారియా ఫార్మర్ ఒకరు. ఎప్‌స్టీన్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆమె దాదాపు మూడు దశాబ్దాల క్రితమే డోనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ఎఫ్‌బీఐకి కూడా వివరాలు అందించారు.
తాజాగా ట్రంప్‌పైనే ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 1995లో ఎప్స్టీన్ మాన్‌హట్టన్ కార్యాలయంలో జరిగిన సంఘటనను ఆమె ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రికతో పంచుకున్నారు. ఆ టైమ్‌లో జెఫ్రీ ఎప్స్టీన్ వద్ద మారియా ఫార్మర్ సహాయకురాలిగా పని చేస్తోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అప్పటి న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.
న్యూయార్క్ టైమ్స్ తో మారియా మాట్లాడుతూ.. ఓరోజు నైట్ బాగా లేట్ అయింది. ఎప్స్టీన్ నాకు కాల్ చేసి మాన్‌హట్టన్ ఆఫీసులో కలవాలని చెప్పడంతో.. నేను నైట్ డ్రెస్ తోనే ఆఫీస్‌కు వెళ్లాను. ఆ టైమ్‌లో ట్రంప్ బిజినెస్ సూట్ ధరించి ఆ చోటుకి వచ్చారు. ఆయన నన్ను అదోలా చూశారు. షార్ట్స్ ధరించి ఉండటంతో ఆయన నా కాళ్లవైపే చూస్తూ ఉండిపోయారు. నాకు చాలా భయం వేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఎప్స్టీన్.. `నో నో.. ఆమె నీకోసం కాదు` అని ట్రంప్ కు చెప్పారు. దాంతో ఆయన అక్కడ నుండి వెళ్లిపోయారు. అప్పటికి నా వయసు 20 ఏళ్లు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మారియా చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. వైట్ హౌస్ మారియా వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయింది. ట్రంప్ ఎప్పుడు కూడా ఎప్స్టీన్ ఆఫీస్‌కు వెళ్లలేదని, ఎప్స్టీన్ తో ట్రంప్ స్నేహాన్ని వదిలేసి చాలా కాలం అవుతోందని పేర్కొంది.