సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24న సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్‌లో జరగనున్న తెలుగు డయాస్పోరా మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ ను 2025 జూలై 27న ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ (పుంగ్గోల్) వద్ద అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు పి. నారాయణ గారు, నారా లోకేష్ గారు, డా. రవికుమార్ వేమూరు గారు, టీజీ భరత్ గారు కూడా పాల్గొంటారు.
డా. రవికుమార్ వేమూరు మార్గదర్శకత్వంలో.ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ రకమైన కార్యక్రమాలను నిర్వహించే విషయంలో ఎంతగానో పరిజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి ఎన్‌ఆర్‌ఐ టీడీపీ గల్ఫ్ అధ్యక్షుడు రాధాకృష్ణ రవి నిర్వహణలో చేపట్టారు.
ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సింగపూర్ నాయకులు సర్వేశ్ మద్దుకూరి మరియు హనుమంతరావు మాదల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. సింగపూర్‌లో ఈ ఈవెంట్‌కు వస్తున్న అనూహ్యమైన స్పందన కారణంగా.. కేవలం రెండు రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సుమారు 5,000 మంది ఈ తెలుగు డయాస్పోరా మీట్ కు హాజరవుతారని నిర్వాహాకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక రుజువు కలిగిన క్యూఆర్ కోడ్ అవసరం. అతిథులకు భోజనం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్దేశించబడింది