ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మరోసారి జరిగే ఎన్నికల్లో కూడా.. కూటమి అధికారం లోకి వస్తుందన్నారు. అవసరమైతే.. తాను చెప్పింది రాసిపెట్టుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు సూ చించారు. ``రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు తరచుగా అడుగుతున్న ప్రశ్న ఇదే. మళ్లీ మీరే అధికా రంలోకి వస్తున్నారా? అని. ఔను. వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. మళ్లీ వచ్చేది కూటమి ప్రభుత్వమే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. దీనికి నేను హామీ ఇస్తున్నా.`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
విజయవాడలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సంద ర్భంగా ఆయన పెట్టుబడి దారుల సందేహాలకు సమాదానం ఇచ్చారు. విశాఖ, కాకినాడలు.. హైడ్రోజన్ ఉత్పత్తికి కేంద్రంగా మారాయని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంకు కూడా ఉందన్నారు. దీనిని నిర్ణీత ధరలకే కేటాయిస్తున్నామని.. ప్రబుత్వం నుంచి సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. సింగిల్ విండో విధానాలను అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
దావోస్ నుంచి లూలూ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని.. వారికి కూడా ఇదే అప్పానని అన్నారు. విజయవాడ, విశాఖలో లులు మాల్స్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొ చ్చిందన్నారు. ఇతర పెట్టుబడి దారులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలని సూచించారు. మరోసారి వచ్చేది కూడా తమ ప్రభుత్వమేనని.. పెట్టుబడి దారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.
దేశంలో మొట్ట మొదటి హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ అవతరించనుందని తెలిపారు. గూగుల్ సంస్థ త్వరలోనే విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందన్నారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసిఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని... కాబట్టి పెట్టుబడి దారులకుఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ``రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. పెట్టుబడి దారులను తరిమేసిన ఒక భూతాన్ని తాము భూస్థాపితం చేస్తున్నామని.. ఇది వేగంగా జరుగుతోందని.. కాబట్టి ఎవరూ ఏపీపై సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని`` చంద్రబాబు చెప్పారు.