ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తెల్లవారుజామున సింగపూర్ చేరుకున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులే లక్ష్యంగా ఐదు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఏపీ అభివృద్ధి విషయంలో అక్కడి తెలుగు వాళ్లు చంద్రబాబుపై స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. ఈ ఏవీ చూసిన చంద్రబాబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు వేదికపై ప్రసంగిస్తూ.. `తెలుగు దేశం పార్టీ హయంలోనే మూడేళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఏపీలో ఏర్పాటు అయ్యాయి. ఈ అంశంపై చాలా మంది అప్పట్లో విమర్శలు చేవారు. కానీ ఫ్యూచర్ మొత్తం ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మాను. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగుజాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించాను.
నేడు సింగపూర్‌లో వేలాది తెలుగు ప్రజలు ఉన్నారంటే ఆనాటి ఆలోచనలే కారణం. సింగపూర్‌లో 40 వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. కానీ, 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే పరిస్థితి తెచ్చారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పాను. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలనే సింగపూర్ పర్యటనకు వచ్చా` అని పేర్కొన్నారు.
సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు.#SingaporeTelugusWelcomeCBN#APatSingapore#CBNinSingapore#LokeshInsingapore pic.twitter.com/Gm24HDKS6i
— Telugu Desam Party (@JaiTDP) July 27, 2025