ఏపీ సీఎం చంద్రబాబు.. మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ వంటి వారితో కలిసి సింగపూర్ కు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఆయన సింగపూర్‌లో అడుగు పెట్టారు. ఏపీలో 4.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబును చూసేందుకు.. ఆయనను స్వాగతించేందుకు సింపూర్‌లో తెలుగు వారు క్యూ కట్టారు. భారీ ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా ఎన్నార్టీ నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
మహిళలు హారతులు పట్టి మరీ చంద్రబాబును సింగపూర్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబా బు వారితో కలిసి ఫొటోలు దిగారు. సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చిన సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు స్వాగతం పలికారు. కూచిపూడి నాట్యంతో చంద్రబాబును పలువురు కళాకారులు మంత్ర ముగ్ధులను చేశారు. సిఎం రాక సందర్భంగా హోటల్ ప్రాగణంలో తెలుగు కుటుంబాల సందడి చేశాయి. కాగా.. సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బృందం 5 రోజుల పాటు పర్యటించనుంది.
మొత్తంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు బిజీ షెడ్యూల్‌తో ఆయన గడపనున్నారు. ఆదివారం మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి.. ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వేమూరి రవికుమార్ నేతృత్వంలో సింగపూర్ `ఎన్ ఆర్ టీ`, గల్ఫ్ అధ్యక్షులు రాధా కృష్ణ రవి సారథ్యంలో ఏర్పాట్లు చేశారు. సింగపూర్‌లోని ఓవిస్ డిజిటల్ క్యాంపస్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఏపీలో పెట్టుబడులు.. ముఖ్యంగా పీ-4 అంశాలపై చంద్రబాబు వారికి వివరించారు.
https://www.youtube.com/live/3WZZ3sMVBxU?si=gIZjXt1vo4A0aKq8