ర‌ష్మిక‌కు వేధింపులు.. డ‌బ్బులిచ్చి మ‌రీ అలా చేయిస్తున్నారా?

admin
Published by Admin — August 13, 2025 in Movies
News Image

ఇండియన్ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర తారల్లో రష్మిక మందన్నా ఒకరు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ అటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ ను కూడా ఏలేస్తున్న ఈ కన్నడ కస్తూరి.. ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా ఎప్పుడూ న‌వ్వుతూనే కనిపిస్తుంటుంది. కానీ నిజానికి ఆమె నవ్వు వెనుక అంతులేని బాధ కూడా దాగి ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక వ్య‌క్తిగ‌త జీవితంలో తాను ఎదుర్కొంటున్న వేధింపులు గురించి వివ‌రిస్తూ ఎమోష‌న‌ల్ అయింది.


ఆన్లైన్ ద్వేషం, ట్రోలింగ్ గురించి ర‌ష్మిక ఓపెన్ అయింది. `ఒక నటిగా నా పని నేను చేసుకుంటూ వెళుతున్నాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అలాంటి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. కొంద‌రు నా ఎదుగుదలను అడ్డుకునేందుకు, నా పేరు చెడగొట్టేందుకు డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు` అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది. 


గత కొన్నేళ్లుగా తనపై తీవ్రమైన ద్వేషం ప్రదర్శిస్తున్నారని.. ప్రతిరోజు నిద్రలేచేసరికి త‌న‌ను ద్వేషిస్తూ వచ్చే నెగటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయని.. ప్రేమించకపోయినా పరవాలేదు కానీ పనిగట్టుకుని ద్వేషిస్తుంటే ఆ నొప్పి భ‌రించలేక‌పోతున్నాన‌ని ర‌ష్మిక ఎమోష‌న‌ల్ అయింది. కెరీర్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఈ వేధింపులు తనను మానసికంగా కుంగదీస్తున్నాయని తెలిపింది. దీంతో అభిమానులు, నెటిజ‌న్లు ర‌ష్మిక మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఒక‌రు ఎదుగుతున్నారంటే ఇటువంటి నెగ‌టివిటీ సాధార‌ణ‌మ‌ని.. వాటిని ప‌ట్టించుకోవ‌ద్దంటూ ర‌ష్మిక‌కు స‌ల‌హాలు ఇస్తున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ర‌ష్మిక ప్ర‌స్తుతం రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ష‌న్‌లో `ది గర్ల్ ఫ్రెండ్`, హ‌ను రాఘ‌వ‌పూడి శిష్యుడితో `మైసా` చిత్రాలు చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడిగా ఓ మూవీకి సైన్ చేసింది. అటు బాలీవుడ్‌లోనూ ర‌ష్మిక ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తోంది.

Tags
Rashmika Mandanna Trolls Tollywood Telugu News Rashmika
Recent Comments
Leave a Comment

Related News