భారతదేశపు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) & బాలీ 92.3 ఎఫ్ఎం "స్వదేశ్" కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని 50కి పైగా భారతీయ సంస్థలు, 25 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. శాన్ జోస్ లోని వీధుల్లో 75 శకటాలతో భారీ పరేడ్ నిర్వహించారు. రంగురంగుల శకటాల ప్రదర్శనతో శాన్ జోస్ లో పండుగ వాతావరణం ఏర్పడింది. భారతీయ సంస్కృతి మరియు కళా రూపాలను ప్రదర్శించడం స్వదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
దాదాపు 100 మందికి పైగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య, శాస్త్రీయ నృత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. పిల్లలు శాస్త్రీయ సంగీతం పాటలతోపాటు, సినిమా పాటలకు నృత్యాలు చేశారు. చెస్, క్యారమ్స్ వంటి గేమ్స్ ఆడారు. జెండా వందనం కార్యక్రమంలో బాలీవుడ్ నటి అమీషా పటేల్ (గ్రాండ్ మార్షల్), ఎర్త్ క్లీన్స్ ఫౌండర్ శ్రీకాంత్ బొల్లా(గెస్ట్ ఆఫ్ ఆనర్), డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రాకేష్ అడ్లఖా(ఎస్ఎఫ్ ఓ) పాల్గొన్నారు. వారు భారత జాతీయ జెండా ఆవిష్కరించి పరేడ్ లో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ వారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉండడం సంతోషాన్నిచ్చిందన్నారు. అమెరికాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించేందుకు AIA చేస్తున్న ప్రయత్నాలను వారంతా అభినందించారు. శాన్ జోస్ మేయర్ మాట్ మహన్ అమెరికా జెండాను ఆవిష్కరించారు.
శాన్ జోస్ లో స్వదేశ్ వేడుకలు పెద్ద ఆకర్షణగా మారాయని, భవిష్యత్తులో ఈ పరేడ్ కు మరింత మంది హాజరవుతారని అన్నారు.
సిలికాన్ వ్యాలీలోని 50 కంటే ఎక్కువ మంది ఎన్నికైన అధికారులు (మేయర్లు, సిటీ కౌన్సిల్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు & ఇతరులు) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆష్ కల్రా (అసెంబ్లీ సభ్యుడు, 25వ అసెంబ్లీ జిల్లా), రాజ్ సల్వాన్ (మేయర్, ఫ్రీమాంట్ నగరం), కార్మెన్ మోంటానో (మేయర్, మిల్పిటాస్ నగరం), లియాంగ్ చావో (మేయర్, కుపెర్టినో నగరం), లారీ క్లీన్ (మేయర్, సన్నీవేల్ నగరం), లిల్లీ మెయి (మేయర్ ఎమెరిటస్, ఫ్రీమాంట్ నగరం), బియెన్ డోన్ (కౌన్సిల్ సభ్యుడు, జిల్లా 7, శాన్ జోస్ నగరం, పాల్ జోసెఫ్ (శాన్ జోస్ చీఫ్), రాజ్ చాహల్ (కౌన్సిల్ సభ్యుడు, శాంటా క్లారా నగరం), నేసా ఫ్లిగోర్ (వైస్ మేయర్, లాస్ ఆల్టోస్ నగరం), టామ్ పైక్ (కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కార్యాలయం), అజయ్ భూటోరియా (భారతీయ సమాజం, బే ప్రాంతం), టీనా వాలియా (కౌన్సిల్ సభ్యుడు, సరటోగా నగరం), రూబెన్ అబ్రికా (కౌన్సిల్ సభ్యుడు, తూర్పు పాలో ఆల్టో నగరం), జార్జ్ కేసీ (కౌన్సిల్ సభ్యుడు, జిల్లా 10, శాన్ జోస్ నగరం), హరీష్ ఖర్బంద (కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం), సుధాన్షు "సుడ్స్" జైన్ (కౌన్సిల్ సభ్యుడు, శాంటా క్లారా నగరం), కెవిన్ పార్క్ (కౌన్సిల్ సభ్యుడు, జిల్లా 4, శాంటా క్లారా నగరం), వివేక్ ప్రసాద్ (ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్), అను నక్కా (మిల్పిటాస్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్), ఆష్లే డార్గెర్ట్ (సూపర్‌వైజర్ ఒట్టో లీ కార్యాలయం), అనురాగ్ పాల్ (అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ కార్యాలయం), జస్టిన్ జియోంగ్ (కాంగ్రెస్ సభ్యుడు సామ్ లికార్డో కార్యాలయం), యాన్ జావో (కౌన్సిల్ సభ్యుడు, సారాటోగా నగరం), డేవిడ్ కోహెన్ (కౌన్సిల్ సభ్యుడు, శాన్ జోస్ నగరం) తదితరులు
భారత దేశంలోని అనేక రాష్ట్రాల సంస్కృతీ/వారసత్వాలు ఉట్టిపడేలా అలంకరించిన అనేక శకటాలు పరేడ్ లో అలరించాయి. ఈ పరేడ్ లో వేలాదిమంది ప్రవాస భారతీయులు దారిపొడువునా సంగీతం వాయిస్తూ, నృత్యం చేసి ఉత్సాహంగా ముందుకు సాగారు. భారతీయుల దేశభక్తికి సంబంధించిన పాటలు, సంగీతంతో శాన్ జోస్ నగరం మార్మోగింది. రాత్రి 10:30 గంటల వరకు కొనసాగిన ఈ వేడుకలను అందరూ ఆస్వాదించారు. విజయ్ భరత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య, శాస్త్రీయ నృత్య, బాణాసంచా కార్యక్రమాలు జరిగాయి. ఝూమ్ ప్రొడక్షన్స్, BATA/AIA Karaoke గాయకులు, డీజే మ్యూజిక్ తో లైవ్ సింగింగ్ కాన్సర్ట్ జరిగింది.
ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన స్పాన్సర్లందరికీ మరియు ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో కృషి చేసిన వాలంటీర్లకు AIA బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఈవెంట్ కు సంజీవ్ గుప్తా CPA గ్రాండ్ స్పాన్సర్‌గా, ప్లాటినం స్పాన్సర్ లావణ్య దువ్వి (రియల్టర్), ట్రావెలాపాడ్ (ట్రావెల్ పార్టనర్), పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అన్నీయా, Z5 (స్ట్రీమింగ్ పార్టనర్), ఎర్త్ క్లీన్స్ (ఎకో ఫ్రెండ్లీ పార్టనర్), సిల్వర్ స్పాన్సర్‌లలో వీ ఇండియన్!, ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, వాచి సిల్క్స్, మై పర్సు & ICICI బ్యాంక్ వ్యవహరించాయని, వారితో పాటు మీడియా పార్టనర్‌ల మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఏఐఏ ప్రతినిధులు చెప్పారు.
స్వదేశ్ ఈవెంట్ విజయవంతంగా ముగియడంతో AIA తమ తదుపరి కార్యక్రమం దసరా, దీపావళి ధమాకా (DDD) కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. మహా మంగళ ఆరతి, రథయాత్ర, బాణసంచా, 35+ అడుగుల రావణ దహనం వంటి ప్రత్యేక కార్యక్రమాలతో దసరా, దీపావళి ధమాకా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏఐఏ ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. గత సంవత్సరం 50 వేల మందికి పైగా ఈ ఈవెంట్ కు హాజరుకాగా..ఈ సారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తోంది. అక్టోబర్ 11న (శనివారం) ప్లెజెంట్‌లోని అలమేడ కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో DDD-2025 జరగనుంది. AIA నిర్వహించబోయే కార్యక్రమాలు, అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం aiaevents.org ను సందర్శించండి.
అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి భారతీయ సంస్కృతి, వారసత్వం గురించి చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఒక చక్కని వేదికను అందిస్తున్న ఎన్ జీవో. సభ్యుల మధ్య సాంస్కృతిక మరియు సామాజిక పరిచయాలను ప్రోత్సహించడం AIA లక్ష్యం. భారత ఉపఖండానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాలను నిర్వహించడం,భారత ఉపఖండంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని, సంస్కృతిని సభ్యలతో పంచుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు.