యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం `వార్ 2`. బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ `కూలీ`తో పోటీ పడుతూ భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో వార్ 2 నేడు విడుదల అయింది.
ఇప్పటికే మన దేశంలో వార్ 2 ప్రీమియర్ షోలు పడగా.. ఇతర దేశాల్లోనూ ఫస్ట్ షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మూవీకి మెజారిటీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. వార్ 2 తప్పకుండా చూడాల్సిన సినిమా అంటున్నారు. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, ట్విస్ట్స్, సర్‌ప్రైజెస్ ఇలా అన్నీ సినిమాలో ఉన్నాయంటున్నారు. `హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలలో జూనియర్ ఎన్టీఆర్ చెలరేగిపోయాడు. అతని బాలీవుడ్ ఎంట్రీకి వార్ 2 పర్ఫెక్ట్ మూవీ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పోటా పోటీగా నటించారు. వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. కియారా గ్లామర్ మరో ప్లస్` అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు అదిరి పోయాయని.. హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, డ్యాన్స్ నంబర్, కొన్ని ట్విస్ట్‌లు బాగా వర్కౌట్ అయ్యాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ కార్ ఛేజింగ్, ట్రైన్ ఫైట్ బాగున్నాయని, ముఖ్యంగా ఎన్టీఆర్ షర్ట్‌లెస్ సీన్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు. హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే రెండు కళ్ళూ చాలవని చాలా మంది తెలిపారు.
అయితే రొటీన్ స్టోరీ, రొటీన్ ప్లాట్ మూవీకి బిగ్ మైనస్. వార్ 1లో ఉన్న నటులు మారారు తప్పితే కథ, కథనం అదే అని టాక్ నడుస్తోంది. పైగా కొన్ని సన్నివేశాలలో వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉందని.. అదేవిధంగా ఎమోషన్ మరియు హై పాయింట్‌లను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ సినిమాలు నచ్చని వారు వార్ 2ను ఎవైడ్ చేయడం మంచిదని కూడా కొందరు చెబుతున్నారు. మొత్తంగా కొందరు వార్ 2 బొమ్మ బ్లాక్ బస్టర్, ఎన్టీఆర్ హిట్ కొట్టాడని అంటుంటే.. మరికొందరు అంత లేదు యావరేజ్ అని పెదవి విరుస్తున్నారు.