గత వారం రెండు పాన్ ఇండియా చిత్రాలు పోటీ పడుతూ థియేటర్స్ లోకి దిగాయి. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్‌గా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా `కూలీ` ఒకటి కాగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేసిన `వార్ 2` మరొకటి. భారీ అంచనాల నడుమ ఒకే రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే స్టార్ కాస్ట్, రిలీజ్ కు ముందుకు మేకర్స్ పెంచిన హైప్ దృష్ట్యా వీకెండ్ వరకు వార్ 2, కూలీ చిత్రాలు బాగానే పెర్ఫార్మ్ చేశాయి.
కానీ వీక్ డేస్‌లోకి ఎంటర్ అయ్యాక కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. 6 రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ను గమనిస్తే.. కూలీ మూవీ తెలుగులో రూ. 38.29 కోట్ల షేర్, రూ. 58.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెట్ టార్గెట్ రూ. 46 కోట్లు కాగా.. మరో రూ. 7.71 కోట్ల షేర్ వస్తే తెలుగులో కూలీ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతుంది. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే.. కూలీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 307 కోట్లు. అయితే 6 డేస్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రజనీ లేటెస్ట్ ఫిల్మ్ రూ. 213.05 కోట్ల షేర్, రూ. 422.70 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. టార్గెట్ ను రీచ్ కావాలంటే ఇంకా రూ. 93.95 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వార్ 2 విషయానికి వస్తే.. తెలుగులో రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆరు రోజుల్లో రూ. 40.93 కోట్ల షేర్, రూ. 59.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే.. వార్ 2 రూ. 151.53 కోట్ల షేర్, రూ. 288.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 307 కోట్ల రేంజ్‌లో ఉంది. సో.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ కావాలంటే ఇంకా రూ. 155.47 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మండే నుంచి హెవీ డ్రాప్స్ నేపథ్యంలో అటు వార్ 2, ఇటు కూలీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వార్ 2కు గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోంది.