ఈ రోజుల్లో మద్యం అలవాటు అనేది చాలా కామన్ అయిపోయింది. సామాన్యుల నుంచి పొలిటీషియన్స్, బిజినెస్ మాన్స్ వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో డ్రింక్ చేస్తూనే ఉంటారు. రెగ్యులర్‌గా తాగే వారు కొందరైతే.. అకేషనల్ గా మద్యం సేవించేవారు మరికొందరు. అయితే మద్యం ముట్టని వారు కూడా ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరు. బాల్యం నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన ఆల్కహాల్ తీసుకోలేదట. తనకు మద్యం అలవాటు లేకపోవడానికి రీజన్ ఏంటో రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
చిన్నతనం నుంచి మద్యం సేవించాలనే కోరిక తనకు ఎప్పుడు కలగలేదని.. తాను పెరిగిన విధానం తనను మధ్యనికి దూరంగా ఉంచిందని రేవంత్ తెలిపారు. సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా, నలుగురికి ఆదర్శంగా ఉండాలని భావించినప్పుడు మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాయని.. ఒక్కసారి తాను నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మద్యం విషయంలో రేవంత్ రెడ్డికి ఉన్న దృఢ సంకల్పం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం సీఎం రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను ఐకాన్‌గా అభివర్ణించారు. సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి ఎలాంటి చెడు అలవాట్లు సీఎంకి లేవని.. ఆయనకు ఫుట్‌బాల్ మాత్రమే ఇష్టమని విశ్వేశ్వర్ రెడ్డి ఆకాశానికి ఎత్తేశారు.