ప్రముఖ సినీ నటుడు నరేష్ ఒక ఇంటివాడు అయ్యారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున తన అభిరుచులకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలతో అత్యంత విలాసంగా కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. తన ప్రియా సఖి పవిత్రతో కలిసి ఉండేందుకు ఐదు ఎకరాల్లో ఇంద్రభవనం లాంటి ఇంటిని కట్టించారు. రీసెంట్ గా నరేష్, పవిత్ర జంట తమ కొత్తింటి లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్, స్టార్ కమెడియన్ ఆలీతో సహా పలువరు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం నరేష్ కొత్త ఇల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లోకి ఎంట్రీ మొదలుకొని మాస్టర్ బెడ్ రూమ్స్, కిచెన్, జిమ్, వరండాలు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్.. ఇలా ప్రతి ఒక్కటి అటు సందర్శకుల్ని, ఇటు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ఇంటి నిర్మాణం కోసం నరేష్ దాదాపుగా రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాడని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.
ఈ విషయం తెలిసి నెటిజన్లు కళ్లు తేలేస్తున్నారు. నరేష్ స్టార్ హీరోలను కూడా మించిపోయాడని చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ ఆస్తుల వివరాలు కూడా తెరపైకి వస్తున్నాయి. లెజెండరీ యాక్ట్రస్, నిర్మాత విజయనిర్మల ఏకైక కుమారుడే నరేష్. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. కథానాయకుడిగా ఫామ్ కోల్పోయాక సహాయక నటుడిగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు 300కి పైగా సినిమాల్లో నటించారు.
పర్సనల్ లైఫ్‌ను పరిశీలిస్తే.. నరేష్ మొదట హరిని అనే మహిళను వివాహం చేసుకుని కొంత కాలానికే విడిపోయారు. రెండోసారి రామ్య రఘుపతి మెడలో మూడుముళ్లు వేశారు. కానీ వీరి బంధం కూడా విడాకులతో ముగిసింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్‌తో వివాహ బంధం ఏర్పరచుకున్నారు. ఇక నరేష్ ఆస్తుల విలువ దాదాపుగా రూ. 400 కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. విజయనిర్మల సంపాదించిన విప్రో సర్కిల్ సమీపంలోని 5 ఎకరాల ఫాం హౌస్ ఖరీదే సుమారు 300కోట్లు. అదేవిధంగా మొయినాబాద్, శంకరపల్లి దగ్గరలోనూ సుమారు 30 ఎకరాల్లో ఫాం హౌస్ లు ఉన్నాయి. వీటి విలువ 100 కోట్లు పైమాటే అని అంటున్నారు.
నటుడు నరేష్ ఇంటిని చూశారా ? ఇంద్రభవనమే.. #Naresh #PavitaLokesh #LuxuryHome @ItsActorNaresh pic.twitter.com/zwr0DhcRBB
— Megha (@MovieloverMegha) August 23, 2025 ">
నటుడు నరేష్ ఇంటిని చూశారా ? ఇంద్రభవనమే.. #Naresh #PavitaLokesh #LuxuryHome @ItsActorNaresh pic.twitter.com/zwr0DhcRBB
— Megha (@MovieloverMegha) August 23, 2025