ఏపీలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు.. ప్రతి జిల్లాలోనూ పాలాభిషేక కార్యక్రమా లు విస్తృతంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ.. నేతృత్వం వహిం చారని అనుకుంటే పొరపాటే. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లోనూ నిర్వహించారు. డీఎస్సీ-2025 జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ కమిటీ అధ్యక్షుడు హేమంత్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇటీవల డీఎస్సీ - 2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేశారు. మొత్తం రాష్ట్రంలో 16435 పోస్టుల ను భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి కేవలం నాలుగు మాసాల్లోనే ప్రభుత్వం ప్రక్రియ పూర్తి చేసింది. తాజాగా మెరిట్ లిస్టును జిల్లాల వారీగా ప్రకటించింది. దీనిలో ఎంపిక అయిన వారు.. తమ ఆనందాన్ని పాలాభిషేకం రూపంలో ప్రదర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని పేర్కొంటూ.. హేమంత్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. తాము ఊహించలేదని, చాలా పారదర్శ కంగాడీ ఎస్సీ-2025 పరీక్షలు నిర్వహించారని వారు పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించి తమ ఆశలు నిలబెట్టారని పేర్కొన్నారు. అదేసమయంలో వైసీపీ సర్కారు వైఖరిని కొందరు అభ్యర్థులు తప్పుబట్టారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదని గుర్తు చేశారు. దీంతో పోటీ తీవ్రంగా ఉందన్నారు.
ఇదిలావుంటే.. మొత్తం 16 వే లమందికి పైగా ఉపాధ్యాయ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. వీరికి సంబంధించిన మెరిట్ జాబితాలను తాజాగా విడుదల చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత.. నియామక పత్రాలను ఇవ్వనున్నారు. అనంతరం.. వచ్చే నెల 1 నుంచే(ముందే చెప్పిన మేరకు) ఆయా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలలకు పంపించనున్నారు.