పూరి జగన్నాథ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూరితో సినిమా అంటే ముఖం చాటేసే హీరోలే ఎక్కువయ్యారు. కారణం ఆయన ఖాతాలో పడుతున్న వరుస ఫ్లాపులే. ఆమధ్య `ఇస్మార్ట్ శంకర్` మూవీతో ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చిన పూరి.. వెంటనే `లైగర్`, `డబుల్ ఇస్మార్ట్` చిత్రాలతో మళ్ళీ పరాజయాలను మూటగట్టుకున్నారు. అయితే ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని పూరి నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే తన మేకింగ్ స్టైల్ మార్చుకొని తమిళ స్టార్ విజయ్ సేతుపతిని లైన్ లో పెట్టారు. ఇటీవలె వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. సీనియర్ స్టార్ బ్యూటీ టబు కీలక పాత్రలో అలరించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి `బెగ్గర్`, `భవతీ భిక్షాందేహీ` టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
అయితే ప్రస్తుతం పూరి ఆన్ ఫైర్‌లో ఉన్నారు. ఓవైపు విజయ్ తో సినిమా కంప్లీట్ చేస్తూనే మరోవైపు మరో రెండు కథల్ని కూడా లాక్ చేసుకున్నారట. ఇందులో ఒక కథను తమిళ స్టార్ హీరోకు, మరొక కథను టాలీవుడ్‌లో ఓ యంగ్ స్టార్‌కు నెరేషన్ ఇవ్వబోతున్నాడట. తమిళంలో శివ కార్తికేయన్, సూర్య.. ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా చేయాలని పూరి భావిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ బలంగా ప్రచారం జరుగుతోంది.