అన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. తమ మధ్య బంధుత్వానికి మించిన ఆత్మీయత, స్నేహం ఉండేవని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతోపాటు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకూ ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అని చంద్రబాబు కొనియాడారు.
హరి మామయ్య వర్థంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నానని లోకేశ్ అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు హరికృష్ణ విశేష సేవలందించారని ప్రశంసించారు. రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారని అన్నారు. హరి మామయ్య లేనిలోటు తీర్చలేనిదని, సినీ, రాజకీయ రంగానికి వారు చేసిన సేవలే చిరస్మరణీయమని తెలిపారు.