భారత దేశంలో ప్రజలపై చెరగని ముద్ర వేసిన ముఖ్యమంత్రుల జాబితా రూపొందిస్తే అందులో టాప్ -10 లో సీఎం చంద్రబాబు తప్పక ఉంటారు. విజనరీ లీడర్ గా దేశవ్యాప్త గుర్తింపు పొందిన చంద్రబాబు తన పాలనా దక్షతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ముఫ్ఫై ఏళ్ల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు.
ఈ క్రమంలోనే తన తండ్రి చంద్రబాబుకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 30 ఏళ్ల ప్రయాణం మైలురాయికి మించినదని లోకేశ్ అన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ మొదలు అమరావతిలో క్వాంటం వ్యాలీ వరకు చంద్రబాబు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇంట్లో నాన్న అని..బయట బాస్ అని పిలిచే అదృష్టం తనకు దక్కడం తన అదృష్టమని అన్నారు.