`హరిహర వీరమల్లు` లాంటి డిజాస్టార్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తాజా చిత్రం ‘ఓజీ’. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ మూవీకి సుజిత్ సైన్ డైరెక్టర్ కాగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 25న ఓజీ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మునుపటి పవన్ గ్రేస్ ను మరోసారి ఈ మూవీ ద్వారా సిల్వర్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఇటు ఫ్యాన్స్ ను, అటు సినీ లవర్స్ ను ఉర్రూతలూగిస్తుంది. ఇకపోతే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే 800కె డాలర్స్ పైగా కలెక్ట్ చేసి అమెరికాలో ఓజీ సరికొత్త రికార్డు సృష్టించింది.
అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్, ఓజీ సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా తాజాగా నైజాం ఫస్ట్ టికెట్ ని వేలం పాట వేశారు. వేలంలో ఓజీ నైజాం ఫస్ట్ టికెట్ ఎంత పలికిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. పవన్ అభిమానులు ఎక్స్ వేదికగా స్పేస్ నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా ఫ్యాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ స్పేస్ లో నైజాం ఏరియా ఓజీ మూవీ ఫస్ట్ టికెట్ ని వేలం వేయగా.. నార్త్ అమెరికాకు చెందిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏకంగా రూ. 5 లక్షలకు పాడుకున్నారు. ఇక ఈ రూ. 5 లక్షలను మరో మూడు రోజుల్లో జనసేన పార్టీ ఫండ్ గా ఇస్తామని ప్రకటించడం మరొక విశేషం.