తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు తో పాటు బీఆర్ఎస్ నాయకులుపై, పార్టీపై కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్ వేటు వేశారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినట్లు పార్టీ అధిష్టానం అధికారికంగా నోట్ విడుదల చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో హరీష్ రావు పాత్ర, మేఘా గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి పై కవిత నిన్న షాకింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత కవితపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.