``తెలుగోళ్లా..`` అని 1950లలో తమిళులు, ఉత్తరాది వారు.. చూసిన చిన్న చూపు నుంచి ఆంధ్రుల ఆత్మగౌ రవం ఎగసి పడేలా చేసిన ఘన కీర్తి పతాక టీడీపీ అధినేత చంద్రబాబు సొంతం. అన్నగారు ఎన్టీఆర్ అందుకున్న ఆత్మగౌరవ నినాదానికి.. విజనరీని జోడించి ప్రపంచం తల తిప్పి చూసేలా చేసిన ఘనత కూడా బాబుకే సొంతం. ఆసేతు హిమాచలం నేడు ఏపీవైపు చూస్తున్నా.. పోటీ ప్రపంచంలో ఏపీని తట్టుకు ని నిలబడాలన్న సంకల్పం చెప్పుకొన్నా.. దానికి ముమ్మాటికీ చంద్రబాబే కారణం.!
నేటిలో జీవించడం మనిషి లక్షణం.. రేపటి గురించి ఆలోచించడం.. మానసిక లక్షణం. కానీ, వచ్చే పదే ళ్లు.. కాదు కాదు.. వందేళ్లకు ప్రణాళిక రచించుకుని.. దాని ప్రకారం నేడే విత్తులు నాటడం.. సంపూర్ణంగా చంద్రబాబు లక్షణం!. బాబుతో విభేదించిన నాయకులు ఉన్నారు. బాబును తిట్టిపోసిన నాయకులు కూడా ఉన్నారు. కానీ, ఆయన విజన్‌ను.. ఆయన దీర్ఘకాలిక ప్రణాళికలను తప్పుబట్టిన నాయకులు(ఒక్క జగన్ తప్ప) ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.. అక్షరాల నిజం.
ఇప్పుడంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ, ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను మాత్ర మే అభివృద్ధి చేస్తున్నారన్న వాదన వచ్చినప్పుడు.. ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం కల్పించారు. సీమ జిల్లాల కరువును పారదోలేందుకు హంద్రీనీవా ప్రాజెక్టును ఎన్టీఆర్ తలపోస్తే.. తర్వాత కాలంలో దానిని నడిపిం చిన ఘనత కూడా.. చంద్రబాబుకే దక్కుతుంది. నేడు హైదరాబాద్‌లో సువిశాల రహదారులు.. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు.. ఏనాడో 1995లోనే బీజం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
``చంద్రబాబును రాజకీయంగా విమర్శిద్దాం. ఆయన చేసిన పనులను ఎందుకు?`` అని అసెంబ్లీ సాక్షిగా నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పిన మాట అక్షర తుల్యం. నాయకులు వస్తారు పోతారు.. కానీ, ప్రజల కోసం.. ప్రగతి కోసం.. పుట్టిన నేల కోసం పరితపించే నాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో తొలి పేజీని సృష్టించిన ఘనత కూడా చంద్రబాబు కే సొంతం. నేటికి(1-సెప్టెంబరు) చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 30 ఏళ్లు అయినా.. ఆయన డైరీ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది. ఎప్పుడూ విజన్ తో నిండిన పేజీలే దర్శన మిస్తాయి. దటీజ్ చంద్రబాబు!