టీడీపీ యువనేత, విశాఖ ఎంపీ భరత్ సింగపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా సింగపూర్ లోని కొందరు యువ ఎన్నారై పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. తమకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఎంపీ భరత్ కు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు. ఆ భేటీ ఎంతో ఫలప్రదంగా ముగిసిందని వారు చెప్పారు. విద్యా వ్యవస్థ, కుటుంబ విలువల, సామాజిక బాధ్యత వంటి విషయాలపై ఆయన తమతో పంచుకున్న విషయాలు ఎంతో అమూల్యమైనవని అన్నారు.
ఎంపీ భరత్ మాటలు తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. యువ పారిశ్రామికవేత్తను భరత్ ప్రోత్సహించి వారికి మార్గదర్శకం చేసే విధానం ఆయన విజన్, ముందు చూపునకు అద్దం పడుతోందని చెప్పారు. ఎంతో విలువైన సమయాన్ని ఆయన తమకు కేటాయించారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, తమ దృక్కోణాన్ని మార్చిన ఒక మంచి అనుభవం అని అన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఎంపీ భరత్ తో మరిన్ని సమావేశాలు జరగాలని కోరుకుంటున్నామని, ఆయన నుంచి మరిన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాని చెప్పారు.