మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ భయంతో హైడ్రామాకు తెర లేపారు. కేసులకు భయపడనంటూ మీడియా ముందు హడావుడి చేస్తున్న కాకాణి.. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు మాత్రం వెనకాడుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలు, ఖనిజం రవాణా, పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించిన వ్యవహారంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.