సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై వైసీపీకి సంబంధించిన ప్రమోషన్ సినిమాలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అభ్యంతర కరంగా చిత్రీకరించారని.. పోస్టర్లు విడుదల చేశారన్న కేసులు ఉన్నాయి. వీటితోపాటు.. ఆయన సోషల్ మీడిలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులు వెంటాడుతున్నాయి. అయితే.. తాజాగా రామమండ్రి 3 టౌన్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో ఓ ఆన్ లైన్ ఛానెల్‌కు వర్మ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిలో ఆయన తన వ్యక్తిగత సెక్స్ అలవాట్లు, మందు వంటివాటిని ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో యువతను ఉద్దేశించి వర్మ దిశానిర్దేశం పేరుతో కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇవి పూర్తిగా మహిళలను కించపరిచేలా .. యువతను తప్పుదోవపట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ.. రాజమండ్రికిచెందిన ఓ సామాజిక ఉద్యమ కారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెక్స్‌లో పార్టనర్‌ను సుఖ పెట్టడం కాదు.. పిచ్చెక్కించేలా నలిపేయాలంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది యువతను తప్పుదోవ పట్టించేలా.. మహిళలను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ.. చేసిన ఫిర్యాదును పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపైనే కేసునమోదు చేశారు. త్వరలోనే రామ్ గోపాల్ వర్మను విచారణకు పిలవనున్నట్టు పోలీసులు చెప్పారు. తాజాగా కేసు నమోదు చేశామని.. 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నట్టు వివరించారు.
సమాజానికి మంచి చేయాల్సిన స్థానంలో ఉన్న సెలబ్రిటీగా.. ఇలా యువతను తప్పుదోవ పట్టించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేయాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని.. త్వరలోనే ఆయనకు నోటీసులు పంపనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా.. ఫ్యామిలీకి ఎప్పటి నుంచో తాను దూరంగా ఉంటున్నానని.. మనిషి జీవితానికి సుఖం అవసరమేనని.. దానికి పెళ్లి మాత్రమే అవసరం కాదని కూడా వర్మ ఇదే ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.