పాకిస్థాన్‌కు దిమ్మతిరిగి పోయేలా భారత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ``ఇది ట్రయలరే.. ఇక, పాకిస్థాన్‌ను చూస్తూ ఊరుకునేదేలేదు.`` అంటూ భారత్ నిప్పులు చెరిగింది. ఆపరేషన్ సిందూర్‌తో వణకుపుట్టించామ ని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పాకిస్థాన్‌లోని అణువణువూ.. బ్రహ్మోస్ క్షిపణికి తెలుసు అంటూ.. నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో పాకిస్థాన్ విషయంలో భారత వైఖరి సుస్పష్టంగా తెలిసింది.
ఏం జరిగింది?
ఇటీవల పాకిస్థాన్ రక్షణ శాఖ, హోం శాఖ మంత్రులు భారత్‌పై ఎప్పుడైనా విరుచుకుపడతామని వ్యాఖ్యా నించారు. పాకిస్థాన్ దయ చూపించి.. కాల్పుల విరమణకు ఒప్పుకుందన్నారు. లేకపోతే.. భారత్ బుగ్గి అయి ఉండేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో అగ్గిని రాజేశాయి. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ఆపరేషన్ సిందూర్ ను పాకిస్థాన్ ప్రాధేయ పడితేనే ఆపామ ని.. అప్పటికే.. పాకిస్థాన్‌లోని సైనిక శిబిరాలు సహా అనేకం నేలమట్టమయ్యాయని పేర్కొంది.
తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బ్రహ్మోస్ ఏరో స్పేస్(గగన తల దాడులు) కేంద్రాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో దీనిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన నూతన తరం బ్రహ్మోస్ క్షిపణులను ఆవిష్కరించి సైన్యానికి అందించారు. ఈక్రమంలో ఆయన స్పందిస్తూ. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ట్రయలర్ మాత్రమేనని చెప్పారు. మున్ముందు పాకిస్థాన్ కోలుకోలేని విధంగా బుద్ధి చెబుతామన్నారు. పాక్ భూభాగంలోని ప్రతి అణువూ.. బ్రహ్మోస్ క్షిపణి కనుసన్నల్లోనే ఉందన్నారు.
``ఇది ఒకప్పటి దేశం కాదు. ఇప్పుడు నమో(నరేంద్ర మోడీ) భారత్. సర్వశక్తిమంతం. గతంలో మాదిరిగా కుప్పిగంతులు వేస్తే.. ఏం చేయాలో అది చేస్తాం. సర్వశక్తిమంతంగా ఉన్నాం. ఎవరినీ ఉపేక్షించం. వాపును బలుపుగా భావించొద్దు. చపల చిత్తుల (పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్) మద్దతు చూసుకుని విర్రవీగొద్దు. తగిన బుద్ధి చెప్పేందుకు వీరావేశంతో బ్రహ్మోస్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి`` అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్‌పై విరుచుకుపడ్డారు.