రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రను నిరూపించే మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు ఇప్పటికే విడుదల చేసిన సెల్పీ వీడియోలు.. ఆధారాలతోపాటువాట్సాప్ చాట్ ఇటీవల బయటకు వచ్చాయి. అయినప్పటికీ.. అద్దేపల్లితో తనకుఎలాంటి సంబంధం లేదని.. అసలు ఆయనతో కలిసి ఉన్నది కూడా లేదని వైసీపీ నేత జోగి బుకాయించారు. అంతేకాదు.. ఈ విషయంపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తన పాత్ర లేదని నిరూపించేందుకు లైడిటెక్టర్ టెస్టుకు కూడా రెడీ అని తెలిపారు.
అయితే.. జోగి వాదన జోగి చెబుతున్నా.. ఆయనకు అద్దేపల్లితో ఉన్న సంబంధాలు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా యి. అవి..జోగి-జనార్దన్‌రావు మధ్య ఉన్న బంధాన్ని, సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారులో ని ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఇద్దరూ సాగించిన మద్యం వ్యవహారాలు.. జోగి లిక్కర్ వ్యాపారాన్ని జనార్దన్ కైవసం చేసుకోవడం.. ఇలా అనేక కోణాలలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముమ్మర విచారణ చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా అద్దేపల్లితో జోగి రమేష్ ఉన్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది.
జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి అద్దేపల్లి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు వురు కూడా పక్క పక్కనే కూర్చున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. దీనిని చూపిస్తున్న టీడీపీ నాయకులు ఇప్పుడు జోగి ఏం చెబుతారు? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు `బుకాయింపులు చెల్లవు జోగి గారూ`` అని కామెంట్లు చేస్తున్నారు. తాను నకిలీ మద్యం తయారీని 2024లోనే మానేశానని అద్దేపల్లి చెప్పుకొచ్చారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. మారిన మద్యం పాలసీతో తాను నకిలీ వ్యాపారాన్ని ఆపేశానన్నారు.
కానీ, కూటమి సర్కారును బద్నాం చేసేందుకు జోగి ప్రమేయంతో తిరిగి నకిలీ మద్యం తయారీని ప్రారంభించినట్టు వెల్లడించారు. అంతేకాదు.. చంద్రబాబుకు బ్యాడ్ నేమ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో జోగి తమను ప్రోత్సహించారనికూడా ఆయన వ్యాఖ్యానిం చారు. ఈ కేసులో కీలక మలుపుగా ఇప్పుడు జోగి-జనార్దన్‌రావు కలిసి ఉన్న ఫొటో వెలుగులోకి రావడంతో వైసీపీ నేత చుట్టూ ఈ కేసు మరింత ముసురుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.