అల్లు ఫ్యామిలీ నుంచి రీసెంట్‌గా ఓ గుడ్ న్యూస్ వెలువడిన సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నయనిక రెడ్డి అనే అమ్మాయితో అక్టోబర్ 30న శిరీష్ ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద తన ప్రేయసి నైనిక చేతిని పట్టుకొని దిగిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకుంటూ పెళ్లి విషయాన్ని రివీల్ చేశాడు. కానీ కాబోయే భార్య ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు.
అయితే తాజాగా అల్లు వారి చిన్న కోడలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సోమవారం దీపావళి కావడంతో అల్లు కుటుంబం అంతా ఒక్కచోట చేరి సందడి చేసింది. ఈ వేడుకల్లో నైనిక కూడా భాగం అయింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలో అల్లు శిరీష్, నైనిక జంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ ఫోటో బయటకు రావడంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. నైనికను చూసి శిరీష్‌కు పర్ఫెక్ట్ జోడి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.

కాగా, అల్లు శిరీష్ - నైనిక చాలా కాలం నుంచి సీక్రెట్‌గా లవ్ స్టోరీ నడుపుతున్నట్లు తెలుస్తోంది. నైనికకు సంబంధించి పెద్దగా వివరాలేమి బయటకు రాలేదు. అయితే ఆమె హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిగా ఫిల్మ్ సర్కిల్స్ ను ప్రచారం జరుగుతోంది. అదే విధంగా నైనిక తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త అని కూడా అంటున్నారు.