యంగ్ హీరో నారా రోహిత్ తన లవ్ లైఫ్‌లో కొత్త దశకి అడుగు పెట్టబోతున్నాడు. తన లాంగ్-టెర్మ్ గర్ల్‌ఫ్రెండ్, హీరోయిన్ శిరీష(సిరి లేళ్ల)తో ఏడడుగులు వేసి బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలకబోతున్నాడు. నారా రోహిత్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఇరు కుటుంబసభ్యులు కలిసి ఈ నెలలోనే పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. అక్టోబర్ 30వ తేదీన హైదరాబాద్ లో అతని వివాహం ఘనంగా జరగనుంది.
నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకల్లో తెలుగు సినీ మరియు రాజకీయ ప్రముఖులు భారీగా హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా శిరీష తన సోషల్ మీడియా అకౌంట్‌లో పసుపు వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి, అభిమానులను మరింత ఉత్సాహ పరిచింది. ఫోటోల్లో ఆమె అందంగా, సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది.

కాగా, `ప్రతినిధి 2` మూవీలో నారా రోహిత్, సిరి లేళ్ల జంటగా నటించారు. ఈ సినిమాతో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుటుంబసభ్యుల సమక్షంలో గత సంవత్సరం వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజులకే నారా రోహిత్ తండ్రి మరణించడంతో పెళ్లి వాయిదా పడింది. తాజాగా పెళ్లి ముహూర్తం ఫిక్స్ కావడంతో అభిమానులకూ, సినీ వర్గాలకూ ఇది హ్యాపీ మూమెంట్ గా మారింది.