పెట్టుబడుల వేటలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం దుబాయ్‌కు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్పేస్ రంగంలో పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గానే కాకుండా.. స్పేస్(అంతరిక్షం) రంగంలోనూ ముందుంచేలా సీఎం ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ రంగంపై ఆసక్తి చూపించే సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారు.
దుబాయ్ సహా ఖతార్ వంటి కీలక ఎడారి దేశాలు.. స్పేస్ స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో తొలిసారిగా భారత్ నుంచి ఏపీ ప్రభుత్వం అక్కడి పారిశ్రామిక వేత్తలపై దృష్టి పెట్టింది. వారిని ఆహ్వానిం చాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గత నెలలోనే ప్రకటన చేసిన ప్రభుత్వం రాజధాని అమరావ తిలో స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. అప్పట్లోనే పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలకాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు.. దుబాయ్, ఖతార్, దోహా యూఏఈలోని ఇతర దేశాలలోనూ పర్యటించ నున్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ఆయనఆహ్వానం పలకడంతోపాటు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, అనుమతుల విషయాన్ని వివరిస్తారు. ముఖ్యంగా విశాఖ సహా.. అమరావతి ప్రాంతాల్లో పెట్టుబడులకు ఉన్న సౌకర్యాలను వెల్లడిస్తారు. ఇప్పటిక ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చిన నేపథ్యంలో ఈ పర్యటన ఎంతో దోహద పడుతుందని సీఎం భావిస్తున్నారు.
అదేవిధంగా నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే విశాఖ పెట్టుబడుల సదస్సుకు కూడా అక్కడి పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో రెండు దేశాల్లో రోడ్ షోలు కూడా నిర్వహిస్తారు. పారిశ్రామిక, పెట్టుబడి దారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారు. అదేసమయంలో దుబాయ్‌లోని తెలుగు సంఘాలను కలుసుకుంటారు. పీ4పై వారికి అవగాహన కల్పిస్తారు. తద్వారా.. పీ4లో వారిని కూడా భాగస్వామ్య మయ్యేలా చర్యలు తీసుకుంటారు.