దుబాయ్ లో చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్!

admin
Published by Admin — October 26, 2025 in Nri
News Image

ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనను విజయవంతంగా ముగించారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే యూఏఈలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలతో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే దుబాయ్ లో తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. యుఏఈ, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరయ్యారు.

ఈ ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ లోని తెలుగు ప్రజలంతా ఇక్కడే ఉన్నట్టు ఉందని అన్నారు. ఆనాడు మిమ్మల్ని గ్లోబల్ సిటిజెన్స్ గా ఉండాలని కోరుకున్నానని, గ్లోబల్ లీడర్స్ గా మారుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

2024 ఎన్నికల్లో కూటమి గెలవాలని, సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి, కూటమికి ఘన విజయం అందించారని అభినందించారు. ప్రభాస్ ఆంధ్రులు తమపై చూపించిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేనని అన్నారు.

తాను దుబాయ్ లో రెండేళ్ళ నుంచి పని చేస్తున్నానని, చంద్రబాబు గారికి దుబాయ్ లో లభించిన రిసెప్షన్, తాను ఇంత వరకు ఎవరికీ లభించలేదని దుబాయ్ లో భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ అన్నారు. ఇది తెలుగు ప్రజల్లో చంద్రబాబు గారి పట్ల ఉన్న గౌరవం అని చెప్పారు. 

దుబాయ్‌లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రవి, 

ఎన్నారై టీడీపీ యూఏఈ అధ్యక్షుడు ఎం విశ్వేశ్వరరావు, సాధికారత సమన్వయకర్త తులసి కుమార్ ముక్కు, వాసురెడ్డి, ఖాదర్ బాషా,నిరంజన్ , హరి , సునీల్ బోయపాటి , సింగయ్య , మురళి తదితరులు పాల్గొన్నారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Cm chandrababu Dubai tour grand welcome nri tdp
Recent Comments
Leave a Comment

Related News