తెలుగు సినీప్రేమికుల హృదయాల్లో తమన్నా అనే పేరు వినగానే గ్లామర్, గ్రేస్, డ్యాన్స్, ఎనర్జీ గుర్తొస్తాయి. స్క్రీన్‌పై తన అటిట్యూడ్, స్టైల్‌తో మెస్మరైజ్ చేసే తమన్నా.. ఒక్కోసారి స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి మరో స్పెషల్ సాంగ్ కోసం ఆమె మళ్లీ సెట్ అయ్యిందంటూ టాలీవుడ్‌లో బజ్ నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ సాంగ్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి తమన్నా పేరును ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
ప్రేక్షకులను ఆకట్టుకునేలా, సినిమాకి అదనపు కమర్షియల్ విలువ ఇచ్చేలా ఈ సాంగ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట. తమన్నా గ్లామర్‌తో పాటను మరో లెవల్ కు తీసుకెళ్లాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే సాంగ్ షూట్ కూడా స్టార్ట్ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. తమన్నా తెలుగులో మరో స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. కాగా, మన శంకర వరప్రసాద్ గారు చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. నయనతార ఇందులో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ రోల్‌లో అలరించబోతున్నారు.