ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. గిరిజన మారు మూల ప్రాం తంలో ఇటీవల 17 గృహాలకు విద్యుత్తును అందించిన విషయం తెలిసిందే. దీంతో గిరిజనుల ఆనందాని కి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు కర్ణాటక నుంచి మూడు మాసాల కిందట తీసుకువచ్చిన కుంకీ ఏనుగులకు ప్రత్యేక ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం నుంచి పవన్ వీటిని తీసుకున్నారు.
అయితే.. ఆ సమయంలో వాటికి ప్రత్యేక ఆవాసం కల్పించాలని కర్ణాటక పేర్కొంది. దీని ప్రకారం.. మాటి చ్చినపవన్ కల్యాణ్.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ముసలిమడుగు ప్రాంతంలో కుంకీ ఏనుగులకు అవసరమైన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. దీనికి గాను 20 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్టు సమాచారం. అయితే.. 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ఆవాసంలో ఏనుగులు విశ్రాంతి తీసుకు నేందుకు.. నీరు, ఆహారం తినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అదేవిధంగా ఏనుగులు విహరించేందుకు విశాలమైన స్థలాన్ని చదును చేశారు. ఈ ఆవాసాన్ని డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్.. ఆదివారం ప్రారంభించారు. ఏనుగులకు ఆహారం తినిపించి వాటి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏనుగుల పర్యవేక్షక సిబ్బందికి తన సొంత నిధులు టిప్పుగా అందించారు. మొత్తం కార్యక్రమాన్ని తన ఫోన్‌లో చిత్రీకరించారు. ఎక్కడా ఎలాంటి ప్రసంగాలు లేకుండా.. సాదా సీదాగానే ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ముగించడం గమనార్హం.
ఈ సందర్భంగా నాలుగు కుంకీ ఏనుగుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీటి ద్వారా ఇతర ఏనుగులు.. అంటే.. పంటలను ధ్వంసం చేయడం, గ్రామాలపై దాడులు చేయడం ద్వారా ప్రజలను భయ భ్రాంతుల కు గురి చేసే ఏనుగులను ఎలా తరిమి కొడతారో కూడా సిబ్బంది వివరించారు. ఏనుగులతో చేసి చూపిం చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.