బ్రేక‌ప్ అంటూ ప్ర‌చారం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన త‌మ‌న్నా – విజ‌య్‌!1

News Image

గ‌త కొన్నేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా , బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ విడిపోయార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి, కెరీర్ విష‌యంలో ఇరువురి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ని బీటౌన్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇలాంటి త‌రుణంలో త‌మ‌న్నా, విజ‌య్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఓవైపు బ్రేక‌ప్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంటే.. మ‌రోవైపు వీరిద్ద‌రూ శుక్ర‌వారం హోలీ వేడుక‌ల్లో సంద‌డి చేశారు. ప్ర‌ముఖ హీరోయిన్ రవీనా టాండన్ త‌న ఇంట హోలీ సంబరాల‌ను ఏర్పాటు చేయ‌గా.. ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో పాటు విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా కూడా హాజ‌ర‌య్యారు. అయితే గ‌తంలో ఏ ఈవెంట్ కు వెళ్లినా, పార్టీకి వెళ్లినా త‌మ‌న్నా, విజ‌య్ జంట‌గానే క‌నిపించేవారు. కానీ హోలీ వేడుక‌లకు మాత్రం త‌మ‌న్నా, విజ‌య్ విడివిడిగా వ‌చ్చారు. ఇరువురు ఎంతో హుషారుగా ఫొటోగ్రాఫర్లను పలకరించి, హోలీ శుభాకాంక్షలు తెలిపారు. విజ‌య్ ఏకంగా ఫొటోగ్రాఫర్లకు క‌ల‌ర్స్ కూడా పూసాడు. బ్రేకప్‌ వార్తల వేళ త‌మ‌న్నా, విజ‌య్ ఒకే ఈవెంట్ లో పాల్గొనడం ఆసక్తిక‌రంగా మారింది. కానీ విడివిడిగా హాజ‌రు కావ‌డంతో.. బ్రేక‌ప్ వార్త‌ల‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. మ‌రి త‌మ‌న్నా, విజ‌య్ క‌లిసే ఉన్నారా? లేక‌ విడిపోయిన త‌ర్వాత కూడా వీరు ఫ్రెండ్స్ గా కొన‌సాగాల‌ని భావిస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Related News