సమంత రెండో ఇన్నింగ్స్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో.. పెళ్లి అయిన నాలుగు రోజులకే ఆమె చేసిన ఒక పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో రాజ్ నిడిమోరును జీవిత భాగస్వామిగా ఎంచుకున్న సామ్… పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కొత్త జీవితం ఆనందించడానికి వెళ్లిపోతుందేమో అనుకున్నారంతా. కానీ.. సమంత మాత్రం ఎప్పటిలాగే తన ప్రొఫెషనల్ యాటిట్యూడ్‌ను రుజువు చేసుకుంది.
పెళ్లి వేడుకలు ముగిసి నాలుగు రోజులు కూడా అవకముందే సమంత తిరిగి తన షూటింగ్ స్పాట్‌కి వెళ్లింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’ సెట్స్‌లో ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఈ సినిమానే సమంత హోం ప్రొడక్షన్స్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న తొలి ప్రాజెక్ట్. కొన్ని రోజుల క్రితమే మూవీ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఆ వేడుకకు స్వయంగా రాజ్ నిడిమోరు హాజరై అందరి దృష్టిని ఆకర్షించాడు.

తాజాగా షూటింగ్ మొదలు కావడంతో సామ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో క్రూతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘లెట్స్ గో’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ ఫోటోలో సమంత- నందిని రెడ్డి కలిసి ఫన్ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లైన వెంటనే హనీమూన్‌కు చెక్కేస్తుంటారు. కానీ, సమంత మాత్రం హనీమూన్‌ను స్కిప్ చేసింది. షూటింగ్ కు వెళ్లిపోయి భర్త రాజ్ కు షాకిచ్చింది. రెండో పెళ్లి తర్వాత కూడా సామ్ కెరీర్‌పై చూపుతున్న డెడికేషన్ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. అయితే రాజ్‌తో హనీమూన్ ఎప్పుడంటూ నెట్‌లో కామెంట్లు మాత్రం ఆగడంలేదు.