ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాట ఇస్తే జరుగుతుందన్న భరోసా ప్రజల్లో బలంగా పెరుగుతోంది. గడిచిన 17 మాసాల్లో ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. గిరిజనుల నుంచి గ్రామీణుల వరకు.. అంధ క్రికెటర్ల నుంచి స్కూలు విద్యార్థుల వర కు.. పవన్ కల్యాణ్ ఏ హామీ ఇచ్చినా వెంటనే అమలు చేస్తున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే వాటిని సాకారం చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ఇమేజ్.. జోరుగా పెరుగుతోంది. ప్రజల్లోనూ మరింత భరోసా కలుగుతోంది. తాజాగా ఈ నెల 5న విద్యార్థులకు ఇచ్చిన హామీని పవన్ కల్యాణ్ కేవలం పది రోజుల్లోనే నిలబెట్టుకుని `దటీజ్.. పవన్ కల్యాణ్` అని మరోసారి అనిపించుకున్నారు.
ఏం జరిగింది?
ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ.. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్(పీటీఎం) నిర్వహించారు. ఈ క్ర మంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు శ్రీకాకుళంలో జిల్లాలోని పాఠశాలలో జరిగిన పీటీఎం కార్యక్రమానికి హాజర య్యారు. పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న `శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల`లో నిర్వహించి న పీటీఎంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయనకలివిడిగా వ్యవహరించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిం చారు. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు తమ సమస్యలు ఆయనకు వివరించారు. పాఠశాలలో కంప్యూటర్లు, ఫర్నిచర్ లేని విషయాన్ని ఉపముఖ్యమంత్రికి చెప్పారు.
దీంతో వెంటనే స్పందించిన ఆయన తొలుత అధికారులను పురమాయించారు. ఆయా ఏర్పాట్లు చేయాలన్నారు. తక్షణమే 25 కంప్యూటర్లు, వాటర్ ప్యూరిఫయర్, బల్లలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే.. ఈ విషయం ఇంకా పెండింగులో ఉందని తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ఆ మరుసటి రెండురోజుల్లోనే ఈవ్యవహారాన్ని పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కృష్ణతేజకు అప్పగించారు. దీంతో వడివడిగా పనులు ముందుకు జరిగాయి. పాఠశాలకు 25 కంప్యూటర్లతోపాటు.. ఫర్నిచర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సామగ్రి సోమవారం సాయంత్రం పాఠశాలకు చేరడంతో విద్యార్థులు డిప్యూటీ సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.