హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏడు అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగా ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ అగ్రనేతలు, గవర్నర్ దత్తాత్రే య సహా బాలు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. దీనికి ముందు పలువురు ఉద్యమ కారులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధం చేశారు. ఈ పరిణామాలు.. ఒకవైపు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బాలు కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ స్పందించారు.
తన తండ్రికి రాజకీయాలతో సంబంధం లేదని చరణ్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తన తండ్రి బాలు రెండు రాష్ట్రాల ప్రజల తోనే మమేకమయ్యారని తెలిపారు. ఎవరు ఆయనను కలుసుకునేందుకు వచ్చినా.. మీరు ఎక్కడివారు? అని కూడా అడిగే వారు కాదన్న బాలు.. ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని తెలిపారు. ఈ విషయం సభకు వచ్చిన అనేక మంది ప్రముఖులకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక భాషల్లో పాటలు పాడిన ఏకైక గాయకుడు కూడా తన తండ్రేనని చెప్పారు. ఆయన ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు ఎప్పుడూ లేవని అందరినీ సమానంగా చూసేవారని వ్యాఖ్యానించారు.
అందుకే.. దేశం యావత్తు ఆనాడు(బాలు మృతి చెందినప్పుడు) కన్నీరు పెట్టుకుందని ఎస్పీ చరణ్ తెలిపారు. ఎంతో మందిని ఆయన కలుసుకునేవారని.. కానీ.. ఎవరికీ ప్రాంతీయ తత్వం, భాషా తత్వాన్ని ఆపాదించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కూడా నాలుగు సంవత్సరాలు శ్రమించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల బాలు కుటుంబ సభ్యులుగా తాముఎంతో సంతోషిస్తున్నామని చరణ్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో తొలుత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య బాలు.. విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన బాలుతో తనకు ఉన్న పరిచయాన్ని, అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు