వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఇంతకన్నా జగన్ ఏం చేస్తాడు`` అంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. తాజాగా మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్ర బాబు.. పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం.. ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వ శాఖలతో సమన్వయంచేసుకోవాలని కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు.
పీపీపీ విధానంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు తమ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అయితే.. వీటిని అడ్డుకు నేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని.. ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు కూడా జగన్ మాయ లో పడకుండా ఉండాలని సూచించారు. రాష్ట్రా న్ని అభివృద్ధి చేయడం కాక.. ఇప్పుడు దారిలో పెడుతుంటే కూడా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం,.. అబద్ధాలు చెప్పడం, ప్రజలను రెచ్చగొట్టేందుకు సొంత మీడియాలో ప్రచారం చేయడం అలవాటుగా మారిందన్నారు. ఈ విషయాలను ప్రజలు గమనించాలని చంద్రబాబు సూచించారు.
`పీపీపీ విధానంలో కాలేజీలు నిర్మిస్తే.. నీకేంటి నష్టం. ఏటా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్నట్టుగానే ఏపీకి కూడా గత ఐదేళ్లలో కొన్ని కాలేజీలు ఇచ్చింది. ఇదేదో మహా ఘనకార్యం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడు. నిధులు పక్కదారి పట్టించి.. కాలేజీలను నిలిపేశాడు. ఇప్పుడు వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే.. దానిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు`` అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పీపీపీ విధానంపై కేంద్ర మంత్రులను కూడా తప్పుదోవ పట్టించేందుకు జగన్ ప్రయత్నించాడని ఆరోపించారు. అయితే.. కేంద్రమే పీపీపీ విధానాన్ని సమర్థించడంతో తోకముడిచాడని ఆక్షేపించారు. ఇంతకన్నా జగన్ ఏం చేయగలడు? అంటూ.. ప్రశ్నించారు.
``పరకామణి దొంగతనం కేసును జగన్ చిన్నదిగా చెప్పాడు.. కానీ ఈ రోజు కోర్టు ఏమంది.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే వారికి హైకోర్టు వ్యాఖ్యలు చెంప పెట్టు. పరకామణి అనేది భక్తులకు-శ్రీవారికి ముడిపడిన వ్యవహారం. భక్తులు భగవంతుడికి ఇచ్చిన కానుకలను పరిరక్షించాల్సింది పోయి.. దొంగలకు మద్దతు పలకడం.. దొంగతనాన్ని చిన్నదిగా చెప్పడం.. జగన్కు అలవాటుగా మారింది. గతంలో గంజాయి తాగేవారికి కూడా ఇలానే మద్దతు ఇచ్చాడు. దోపిడీదారులను పార్టీలో పెట్టుకుని.. ప్రజల సొమ్మును దోచుకున్నాడు. ఇలాంటి వాటిని ప్రజలు క్షమించరు`` అని చంద్రబాబునిప్పులు చెరిగారు.