తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడు విడతలు గా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బుధవారం తుది విడత పోలింగ్ జరిగింది. అయితే.. రెండో దశ ఎన్నికల పోలింగ్‌కు లభించినంత స్పందన అయితే. ఈ ఎన్నికలకు లభించకపోవడం గమనార్హం. ఇక, తుది విడతలో మొత్తం 3752 పంచయతీ సర్పంచులు, 28410 వార్డు స్థానాల అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు తేల్చారు. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లోనూ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది.
మొత్తం 31 జిల్లాల్లో 12728 పంచాయతీ సర్పంచులకు.. మూడు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే.. వీటిలో 700 పైచిలుకు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్ని చోట్లటాస్ వేసుకుని సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. మరికొన్ని పంచాయతీల్లో.. సగం-సగం పంచుకున్నారు. ఇలా భిన్నమైన పరిస్థితుల మధ్య పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా సీరియస్ గా తీసుకున్నాయి.
తొలి విడతలో 65-72 మధ్య సాగిన పోలింగ్ శాతం.. రెండో విడతకు వచ్చేసరికి ఏకంగా 84 శాతం నుంచి 99 శాతానికి ఎగబాకింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని భావించారు. తీరా చూస్తే.. పల్లెల్లో హస్తం హవా స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే మూడో విడత ఎన్నికకు ప్రాధాన్యం పెరిగింది. ఇక, తాజాగా ముగిసిన పల్లె పోరుతో సర్కారుకు బిగ్ రిలీఫ్ లభించినట్టు అయింది. ఫలితంగా.. పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు అడ్డు తొలిగింది.