ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఏ పండుగ వచ్చినా.. నియోజకవర్గం ప్రజలకు పెద్దన్నగా చేరువ అవుతు న్నారు. తాజా క్రిస్మస్‌ను పురస్కరించుకుని క్రైస్తవులకు ఆయన పలు కానుకలు అందించి అక్కున చేర్చుకున్నారు. గడచిన ఏడాది కాలంలో కుటుంబ సభ్యులను కోల్పోయి పండగలకు దూరంగా ఉన్న దాదాపు 4 వేల కుటుంబాలకు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగల సందర్భంగా తానే స్వయంగా తయారు చేయిస్తున్న కేజీ అరిసెలు, అరకిలో చెక్కలతో ఉన్న ప్యాకేజీ కిట్ ను ఆయా కుటుంబాలకు అందించారు.
పెదవేగి మండలం లోని అమ్మపాలెం గ్రామంలో 12 కుటుంబాలకు, పెదకడిమి గ్రామంలో 10 కుటుంబా లకు, జానంపేట గ్రామంలో 13 కుటుంబాలకు, పినకడిమి గ్రామంలో 8 కుటుంబాలకు, వంగూరు గ్రామం లో 26 కుటుంబాలకు, కొప్పాక గ్రామంలో 20 కుటుంబాలకు, కవ్వగుంట గ్రామంలో 17 కుటుంబాలకు, బి సింగవరం గ్రామంలోని 10 కుటుంబాలకు, రాయన్నపాలెం గ్రామంలోని 8 కుటుంబాలకు, అంకన్న గూడెం గ్రామంలోని 13 కుటుంబాలకు, దుగ్గిరాల గ్రామంలోని 17 కుటుంబాలకు కానుకలు అందించారు.
అదేవిధంగా నడిపల్లి గ్రామంలోని 6 కుటుంబాలకు, బాపిరాజు గూడెం లోని 11 కుటుంబాలకు, జగన్నాధపురం గ్రామంలోని 18 కుటుంబాలకు, విజయరాయి గ్రామంలోని 9 కుటుంబాలకు వెరసి మొత్తం దాదాపు 200 కుటుంబాలకు ఎమ్మెల్యే చింతమనేని స్వీటీ ప్యాకేజ్ కిట్లను అందించారు. ఇదేసమయంలో కూటమి నాయకులకు కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆయా కుటుంబాల వద్దకు వెళ్లి.. ప్యాకేజీలను అందించారు.
ఇప్పుడే కాదు..
చింతమనేని ప్రభాకర్ తన మనసు చాటు కోవడం ఇప్పుడే కాదు.. గత ఏడాదిన్నర కాలంగా.. రంజాన్ సమయంలో కూడా ప్రతి ముస్లిం కుటుంబానికీ రెండు కేజీల చొప్పున మాంసాహారం అందించారు. సంక్రాంతి సమయంలో పేద హిందువుల కుటుంబాలకు.. దుస్తులు, కానుకలు కూడా పంచారు. ఇలా.. ఏ పండుగ వచ్చినా.. చింతమనేని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రతి కుటుంబాన్నీ తన అక్కున చేర్చుకుంటున్నారు. మొత్తానికి గతానికి భిన్నంగా గడ్కరీ వ్యవహరిస్తున్న తీరు అందరికీ ముగ్ధులను చేస్తోంది.