2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పలుకీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రాష్ట్రానికి పెట్టు బడులు తీసుకురావడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్‌ను ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా రాజధాని ప్రాంతాన్ని మరో 44 వేల ఎకరాలను ఎకరాలకు విస్తరించాలని కూడా ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో 5 వేల ఎకరాలను విమానాశ్రయానికి కేటాయించనున్నారు.
అదేవిధంగా ఇప్పటికే ప్రకటించిన స్పోర్ట్స్ సిటీని మరింత విస్తరించనున్నారు. ఇది కూడా ఈ ఏడాది తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పాలి. అలానే.. రాజధానిలో అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలని అను కున్నా.. వైసీపీ హయాంలో విజయవాడలో నిర్మించిన నేపథ్యంలో రాజధానిలో కేటాయించిన భూమిలో అంబేడ్కర్ స్మృతి వనాన్ని యథాతథంగా నిర్మించనున్నారు. అయితే.. అక్కడ విగ్రహం కాకుండా.. లైబ్రరీ.. అంబేడ్కర్ జీవిత విశేషాలతో కూడిన.. ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇక, ఈ ఏడాది తీసుకున్న మరో కీలక నిర్ణయం గ్రేటర్ విశాఖపట్నాన్ని మొత్తం 10 జిల్లాలకు విస్తరించడం ద్వారా.. మెగా గ్రేటర్ విశాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా అభివృద్ధిని మరింతముందు కు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అలానే.. జిల్లాల విభజనను కూడా ఈ ఏడాది చేపట్టారు. మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల సంక్య ను కూడా పెంచనున్నారు. ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇక, ఈ ఏడాది తీసుకున్న మరో కీలక నిర్ణయం.. రాష్ట్ర ప్రభుత్వంలోని కార్యదర్శులు కూడా వచ్చే ఏడాది నుంచి ప్రజల మధ్యకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను.. సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇప్పటి వరకు.. నాయకు లు... మంత్రులు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే.. ఇక నుంచి అధికారులను కూడా సీఎం చంద్రబాబు దీనిలో భాగం చేశారు. సంక్రాంతి తర్వాత నుంచి వారు కూడా ప్రజల మధ్యకు రానున్నారు. సో.. మొత్తంగా ఈ ఏడాది కొత్త ఇన్షియేటివ్స్‌తో ప్రభుత్వం దూసుకుపోయిందనే చెప్పాలి.