మెరిల్‌విల్ నగరంలో 2025, విశ్వావసు ఉగాది వేడుకలు!

News Image

చికాగో మహా నగర సమీపాన గల మెరిల్‌విల్ నగరంలో మార్చి 15, 2025 విశ్వావసు ఉగాది వేడుకలు  ఘనంగా నిర్వహించారు.  స్థానిక (IACC) ఆడిటోరియంలో ‌జరిగిన ఈ కార్యక్రమానికి 200 మంది పైగా హాజరయ్యారు. Dr. పన్నా బరై,  Dr.చందన వావిలాల, Dr. అంజనీ ప్రియ తల్లంరాజు, ఇందిర కేసాని, Dr. చిల్లరిగె అన్నాజీ మరియు  ఇతర సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను Dr. చిల్లరిగె అన్నాజీ గారు సాదరంగా ఆహ్వానించారు Dr. కిషోర్ కేసాని గారు స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనిల్ వెలిగండ్ల ఆధ్వర్యంలో ఈ సభా ప్రాంగణాన్ని చాలా చక్కగా అలంకరించారు. ఆ అలంకరణలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే పాటలు, లావణ్య వెలిగండ్ల మరియు సౌజన్య చాగి ఆధ్వర్యంలో జరిగిన వివిధ వినోద కార్యక్రమాలతో కొనసాగిన ఈ వేడుక, పండుగ వాతావరణాన్ని తలపించింది.  ప్రధానంగా ఆడపడుచుల నృత్యాలు ఈ కార్యక్రమానికి వచ్చిన  అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆటా పాటలో పాలుగొన్న చిన్నారులకు పద్మిని మాకం గారు ట్రోఫీలను అందజేశారు.  ఈ కార్యక్రమానికి సహకరించిన అనేక మంది స్వచ్ఛంద సేవకులను Dr. వెంకట రమణ వావిలాల అభినందించారు. ఈ కార్యక్రమమును పర్యవేక్షించి మరియు సాంకేతిక సహకారంను అందజేసిన యుగంధర్ నగేష్, శ్రీ లత ఎలమంచిలి దంపతులకు Dr. రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related News