ప్రతి సంవత్సరం తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటు. ఏడాదంతా రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగను మాత్రం కుటుంబసభ్యులతో కలిసి నారావారి పల్లెలో జరుపుకోవడం ఆనవాయితీ. ప్రతి ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి చంద్రబాబు కుటుంబ సభ్యులు పండుగ జరుపుకుంటారు. ఈ క్రమంలోనే కలెక్టర్లతో సమీక్షా సమావేశం అనంతరం నారావారిపల్లెకు హెలికాప్టర్ లో చంద్రబాబు పయనమయ్యారు.
స్వగ్రామంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి రేపు సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొంటారు. మంగళవారం నాడు నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేస్తారు. 15వ తేదీన తమ గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి సకుటుంబసపరివాసమేతంగా సీఎం చంద్రబాబు వెళతారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.