ఏపీ సీఎం చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్, నారా బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధరతోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. మ్యూజికల్ ఛెయిర్స్ తో పాటు పలు క్రీడా పోటీల్లో దేవాంశ్ పాల్గొని సందడి చేశాడు. ఆటలపోటీలతో పాటు పలు పోటీలను చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆసక్తిగా తిలకించారు. ఆటల పోటీలలో గెలుపొందిన దేవాన్ష్ కు తాతయ్య చంద్రబాబు బహుమతి ప్రదానం చేశారు. ఆ తర్వాత ప్రజల నుంచి వినతిపత్రాలను చంద్రబాబు స్వీకరించారు.
నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3 రోజులపాటు నారావారిపల్లెలో చంద్రబాబు గడపనున్నారు.