కూటమి మరో 15 ఏళ్లపాటు అధికారంలోనే ఉంటుందని తరచుగా చెప్పే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా కీలక వ్యా ఖ్యలు చేశారు. ప్రభు త్వాలు శాశ్వతమని చెప్పారు. పార్టీలు మారితే మారొచ్చు కానీ.. ప్రభుత్వాలు.. ప్రభుత్వ విధానాలు మాత్రం ప్రజలకు చేరువగా ఉండాలని.. అవి శాశ్వతమని వ్యాఖ్యానించారు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సంబంధించిన భారీ మిషనరీని ఈ రోజు(శనివారం) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
``ప్రభుత్వాలు శాశ్వతం. పార్టీలు మారొచ్చు. కానీ, విధానాలు మారకూడదు. అభివృద్ది పనులు కొనసాగాలి. ప్రజలకుమరింత చేరువ కావాలి. ఇది శాశ్వత అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలి.`` అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందేనన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేశారని .. గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులను కూడా సాగనివ్వలేదని దుయ్యబట్టారు. పెట్టుబడి దారులనుతరిమి వేశారని.. కనీసం ఒక్క పెట్టు బడి కూడా తీసుకురాలేక పోయారని.. అలాంటి భయంకర పరిస్థితులను మార్చి.. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వస్తున్నామన్నారు.
ఈ పెట్టుబడులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రజలపైనా ఉంటుందన్నారు. ఒక పెట్టుబడి వస్తే..వేల మందికి ఉద్యోగం, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు. కానీ, గత ప్రభుత్వం ఈ లాజిక్‌ను మిస్ చేసిందన్నారు. అయితే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపెట్టుబడులకు పెద్ద పీట వేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలను వేధించారని తెలిపారు. కానీ, ఇప్పుడు పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నా రు. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని తెలిపారు. ప్రతి పెట్టుబడి వెనుక సీఎం చంద్రబాబుకృషి ఎంతో ఉందన్నారు.