ఓటీటీలో `రాజాసాబ్` అసలు సిసలు మ్యాజిక్.. ఈసారి ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

admin
Published by Admin — February 05, 2026 in Movies
News Image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌ లో భారీ హైప్ న‌డుమ‌ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజైన ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. థియేటర్లలో ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఫ్యాన్స్‌ను అలరించినప్పటికీ, కంటెంట్ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో కంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు ఓటీటీ వేదికగా సిద్ధమైపోయింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 6 నుంచి `ది రాజాసాబ్` స్ట్రీమింగ్ కానుంది. అయితే అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతోంది. థియేటర్ రన్ కోసం ఎడిటింగ్ టేబుల్ మీద కట్ అయిన కొన్ని పవర్‌ఫుల్ సీన్స్‌ను ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేశారు. మేకర్స్ చెప్తున్న సమాచారం ప్రకారం.. థియేటర్లో మిస్ అయిన ప్రభాస్ ఎనర్జిటిక్ సీన్స్ , అలాగే సంజయ్ దత్‌తో వచ్చే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఈ అన్‌కట్ వెర్షన్‌లో హైలైట్ కానున్నాయి.

థియేటర్లో సినిమా చూసిన ఫ్యాన్స్ సైతం `అరే.. ఇంకాస్త ఉంటే బాగుండు` అని అనుకున్న సీన్స్ అన్నీ ఇప్పుడు స్ట్రీమింగ్ వెర్షన్‌లో ఉండబోతున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తమ గ్లామర్‌తో మెప్పించగా, థమన్ అందించిన మ్యూజిక్ హోమ్ థియేటర్లలో రీసౌండ్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మేక‌ర్స్ బ‌లంగా నమ్ముతున్నారు. ఇక‌ అన్‌కట్ వెర్షన్‌లో రాజాసాబ్ విశ్వరూపం చూసి ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం గ్యారెంటీ అని కూడా టాక్ వినిపిస్తోంది. 

Tags
The Raja Saab Prabhas The Raja Saab On OTT Rebel Star Prabhas Maruthi Jio Hotstar
Recent Comments
Leave a Comment

Related News

Latest News