ఆ భయంతోనే లోక్ సభకు మోదీ డుమ్మా?

admin
Published by Admin — February 06, 2026 in National
News Image
పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. సాక్షాత్తూ స‌హా నాయ‌కుడు, ప్ర‌ధాన మంత్రిని లోక్‌స‌భ‌కు రావ‌ద్ద‌ని తానే అడ్డుకున్న‌ట్టు స్పీక‌ర్ ఓం బిర్లా చెప్పారు. వాస్త‌వానికి లోక్‌స‌భ స‌హా.. రాజ్య‌స‌భ‌పై స్పీక‌ర్‌, చైర్మ‌న్‌ల‌కు ఎంత ప‌ట్టు ఉంటుందో.. ప్ర‌భుత్వం ప‌రంగా, రాజ్యాంగం ప‌రంగా ప్ర‌ధాన మంత్రికి ఉభ‌య స‌భ‌ల‌పై అంతే ప‌ట్టు ఉంటుంది. ఇరు స‌భ‌ల‌కూ ఆయ‌న ఎప్పుడైనా వెళ్లొచ్చు.
 
మ‌రీముఖ్యంగా రాష్ట్ర‌ప‌తి చేసిన బ‌డ్జెట్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌ధాని ప్ర‌సంగ‌మే అత్యంత ముఖ్యం. దీనిని ఇప్ప‌టి వ‌ర‌కు లోక్‌స‌భ‌లోనే చేశారు. గ‌త ప్ర‌ధానులు అంద‌రూ.. రాజ్య‌స‌భ‌లో ధ‌న్య‌వాద తీర్మానంపై ప్ర‌సంగించినా.. ముందుగా లోక్‌స‌భ‌నే ఎంచుకునేవారు. అయితే.. తొలిసారి.. ప్ర‌ధాని మోడీ లోక్‌స‌భ‌కు రాకుండానే.. ఈ స‌భ‌లో ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ ముగిసింద‌ని.. తానే ప్ర‌ధాన‌మంత్రిని స‌భ‌కు రావ‌ద్ద‌ని సూచించాన‌ని స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇలా జ‌ర‌గ‌డం దేశంలో ఇదే తొలిసారి.
 
``గౌరవ ప్రధాని రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగం చేసే సమయంలో... ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ లు మోడీ మీద భౌతిక దాడి చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఈ మేర‌కు నాకు( స్పీకర్) సమాచారం వ‌చ్చింది. అందుకనే... మోడీని సభకు రావద్దు అని కోరా. ఇది దుర‌దృష్ట‌క‌రం అయినా.. త‌ప్ప‌లేదు`` అని స్పీక‌ర్ పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ‌నుముగించిన‌ట్టు ప్ర‌క‌టించారు.
 
వాస్త‌వం ఏంటి?
 
వాస్త‌వం విరుద్ధంగా ఉంది. నిజానికి ప్ర‌ధాని వ‌స్తానంటే.. స‌భ‌లో ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేనంత వీక్‌గా దేశం ఏమీ లేదు. పారా మిలీట‌రీ నుంచి బ్లాక్ క్యాట్ క‌మెండోల వ‌ర‌కు ప్ర‌ధానికి భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. పార్ల‌మెంటు ర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక విభాగాలు కూడా ఉన్నాయి. సో.. భ‌ద్ర‌త లోపం లేదా.. విప‌క్షాలు దాడి చేసే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ అన‌వ‌సరం. ఒక‌వేళ నిజంగానే ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేసి.. దాడి చేసే అవ‌కాశం ఉంటే.. వారిపై చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు రాజ్యాంగ‌బ‌ద్ధంగా స్పీక‌ర్ కు ఉంది. దానిని ప్ర‌యోగించి.. వారిని బ‌య‌ట‌కు పంపొచ్చు. లేదా అన‌ర్హుల‌ను కూడా చేయొచ్చు. కాబ‌ట్టి ఈ వాద‌న స‌రికాదు.
 
మ‌రి ఏది నిజం?
 
ప్ర‌స్తుతం బ‌డ్జెట్ స‌మావేశాల్లో మాజీ సైనికాధ్య‌క్షుడు జ‌న‌ర‌ల్ న‌వ‌ర‌ణే రాసిన త‌న జీవిత క‌థ పుస్త‌కం కాక‌రేపుతోంది. చైనాతో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న 2022లో తాను ప్ర‌ధాని మోడీ, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల స‌ల‌హా కోరాన‌ని.. ఎలా ఎదుర్కొందామ‌ని వారి వ‌ద్ద‌కు వెళ్లాన‌ని.. కానీ, వారు... మౌనం పాటించార‌ని. .. ఈ కార‌ణంగానే.. చైనా బ‌ల‌గాలు ల‌ద్ధ‌ఖ్‌లోకి దూసుకు వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లోనే తెలంగాణ‌సైనికుడు సంతోష్ మృతి చెందిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం.
 
ఇది కాక రేపుతోంది. విప‌క్ష నేత రాహుల్ గాంధీ.. న‌ర‌వణే పుస్త‌కాన్ని ప‌ట్టుకుని పార్ల‌మెంటుకు వ‌చ్చారు. ప్ర‌ధాని స‌భ‌కు వ‌స్తార‌ని.. ఆయ‌న‌కు ఈ పుస్త‌కాన్నికానుకగా ఇస్తాన‌ని రాహుల్ ప్ర‌క‌టించారు. ఈ కార‌ణంగానే బుధ‌వారం ప్ర‌ధాని లోక్‌స‌భ‌కు రాలేదన్న వాద‌న ఉంది. ఇక‌, గురువారంతో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలుతెలిపే తీర్మానం ఉభ‌య స‌భ‌ల్లోనూ ముగించాల్సి ఉంది. దీంతో లోక్‌స‌భ‌కు రాకుండా .. ప్ర‌ధాని రాజ్య‌స‌భ‌కు వెళ్లి ప్ర‌సంగించారు. దీనికి కార‌ణం.. రాజ్య‌స‌భ‌కు రాహుల్‌కుఎంట్రీ లేదు. అక్క‌డ సోనియా, ఖ‌ర్గే వంటి నాయ‌కులు ఉన్నా.. ఇంత దూకుడుగా వారు వ్య‌వ‌హ‌రించ‌లేరు. ఇదీ.. అస‌లు నిజం. 
Tags
pm modi rahul gandhi lok sabha skipped
Recent Comments
Leave a Comment

Related News