చంద్రబాబుపై వైసీపీ ఏడుపు

admin
Published by Admin — February 09, 2026 in Andhra
News Image

ఏపీలో వాద ప్ర‌తివాదాల‌కు.. ఆరోప‌ణ‌-ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు దారి తీసిన‌.. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ వ్య‌వ‌హారం.. ఒక‌వైపు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇది.. కోట్లాది మంది హిందువుల మ‌నో భావాల‌కు సంబంధించిన అంశం కావ‌డంతో .. దీనిలో నిజానిజాలు వెలికి తీయాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌పిస్తున్నా రు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సీబీఐ ఇచ్చిన నివేదిక లేదా చార్జిషీట్‌తోనే స‌రిపుచ్చుకుని చేతులు దులుపు కోకుండా.. ఏక‌స‌భ్య క‌మిష‌న్ కూడా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇది.. జనం కోసం చంద్ర‌బాబు ప‌డుతున్న త‌ప‌న‌.. కోట్లాది మంది భ‌క్తులు విశ్వ‌సించే తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర‌త‌ను కాపాల‌న్న నిశ్చ‌యం. కానీ, ఇదే స‌మ‌యంలో దీనిని రాజ‌కీయం చేయ‌డంతోపాటు.. సీబీఐ త‌మ‌కు క్లీన్ చిట్ ఇచ్చేసింద‌న్న వాద‌న‌ను వైసీపీ వినిపిస్తోంది. దీనికితోడు.. ఇప్పుడు చంద్ర‌బాబు కుటుం బానికి చెందిన హెరిటేజ్ సంస్థ‌ల్లో విక్ర‌యిస్తున్న పెరుగు న‌కిలీద‌ని, ర‌సాయ‌నాలు క‌లిపి విక్ర‌యిస్తున్నార ని.. వైసీపీ మీడియాలో తెగ ప్ర‌చారం చేస్తున్నారు.

అంటే ఒక‌ర‌కంగా.. తిరుమ‌ల నెయ్యిపై మాట్లాడుతున్న సీఎం చంద్ర‌బాబుకు ఏదో ఒక విధంగా కౌంట‌ర్ ఇచ్చి.. మాట్లాడ‌కుండా చేయాల‌న్న ఉద్దేశం వైసీపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఒక‌వేళ వైసీపీ చెప్పిందే నిజ‌మైతే..(నిజం కాద‌ని హెరిటేజ్ ప్ర‌క‌టించింది).. ఇది వినియోగదారుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. వారికి న‌చ్చితేనే హెరిటేజ్‌లో పెరుగైనా.. ఇత‌ర ఉత్ప‌త్తులైనా కొనుగోలు చేస్తారు. లేక‌పోతే.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు సంస్థ‌లు అనేకం ఉన్నాయి.

కానీ, వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల‌లో జ‌రిగిన పాపానికి ప్ర‌త్యామ్నాయం లేదు క‌దా! అనేది ప్ర‌శ్న‌. ఎందుకం టే.. తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదాన్ని ఇత‌ర ఏ సంస్థ కూడా విక్ర‌యించ‌దు. తిరుమ‌ల‌లోనే భ‌క్తులు కొనుగోలు చేయాలి. ఇంత ప‌విత్ర‌మైన ల‌డ్డూను క‌ల్తీ చేసి.. దీనిని క‌ప్పిపుచ్చుకునేందుకు.. వైసీపీ ఇప్పుడు హెరిటేజ్ ఉదంతాన్ని తెర‌మీదికి తీసుకురావ‌డం ఏమేర‌కు సమంజ‌సం అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. ఇది ద‌గుల్బాజీ త‌నం కాదా? అనే ప్ర‌శ్న‌లకు ఆ పార్టీ స‌మాధానంచెప్పాలని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. 

Tags
Cm chandrababu ycp jealous
Recent Comments
Leave a Comment

Related News