ఇక క‌ష్ట‌మే... సుబ్బారెడ్డికి.. చిక్కులు.. !

admin
Published by Admin — February 10, 2026 in Andhra
News Image

వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఓపెన్ అయ్యారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సా దంలో క‌ల్తీ జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న ఒప్పుకొన్నారు. ఈ కల్తీ వ్య‌వ‌హారంపై త‌న వ‌ర‌కు కూడా ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని.. తొలిసారి ఆయ‌న గ‌ళం విప్పారు. అయితే.. ఎలాంటి ప‌దార్థాల‌ను క‌ల్తీ చేశార‌న్న విష‌యంపై మాత్రం వైవీ మౌనంగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపైనే పెద్ద ఎత్తున ర‌చ్చ సాగుతున్న నేప‌థ్యంలో వైవీ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

వాస్త‌వానికి.. కూట‌మి స‌ర్కారుపై వైసీపీ నాయ‌కులు ఎదురు దాడి చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ కూట‌మి స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ల‌డ్డూలో క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని.. త‌మ‌కు సీబీఐ సిట్ నివేదిక క్లీన్ చిట్ కూడా ఇచ్చింద‌ని వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు కూడా పిలుపునిచ్చారు. మ‌రోవైపు స‌ర్కారు ఇంటింటి ప్ర‌చారానికి రెడీ అయింది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఆయ‌న‌కే ముప్పు..?

ప్ర‌స్తుతం వైసీపీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోనుంది. ఈ విష యంలో ఏక స‌భ్య క‌మిష‌న్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. వైవీనే నేరుగా నిజం ఒప్పుకోవ‌డంతో ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మ‌రింత రాజ‌కీయ పోరు సాగ‌నుంది. ఇదేస‌మ‌యంలో వైవీని కీల‌క నింది తుడిగా చేర్చే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు కూడా భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వైవీని మ‌రింత లోతుగా విచారించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ మాట‌లు చేటు..!

త‌న‌కు క‌ల్తీ వ్య‌వ‌హారం తెలిసిన త‌ర్వాత‌.. అధికారుల నుంచి వివ‌రాలు కోరాన‌ని.. కానీ, వారు త‌న‌కు ఏమీ చెప్ప‌లేద‌ని వైవీ చెప్పుకొచ్చారు. అయితే.. వాస్త‌వానికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్గా వ్య‌వ‌హ‌రించిన వైవీకి పూర్తిస్థాయిలో అధికారుల‌పై ప‌ట్టు ఉంటుంది. మ‌రి అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఎందుకు ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది ప్ర‌శ్న. ఇదేస‌మ‌యంలో త‌న పీఏ చిన్న అప్ప‌న్న ఖాతాలో 4.2 కోట్ల రూపాయ‌లు ఎందుకు వ‌చ్చాయి? ఎన్‌డీడీబీ నివేదిక‌ను ఎందుకు తొక్కి పెట్టాల్సి వ‌చ్చింది? ఇలా.. అనే ప్ర‌శ్న‌ల‌కు వైవీ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

Tags
Yv subbareddy involved laddu adulteration issue ycp
Recent Comments
Leave a Comment

Related News