బ‌డ్జెట్‌పై ప్ర‌జ‌ల్లోకి: కూట‌మి ఉమ్మ‌డి నిర్ణ‌యం!

admin
Published by Admin — February 18, 2026 in Andhra
News Image

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అసెంబ్లీలో తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో పేర్కొన్న ప‌లు అంశాల‌ను, సంక్షేమ ప‌థ‌కాల‌కు కేటాయించిన నిధుల‌ను ప్ర‌జ‌లకు వివ‌రించా లని నిర్ణ‌యించింది. కూట‌మి పార్టీల రాష్ట్ర అధ్య‌క్షుడు, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుల మ‌ధ్య ఆదివారం.. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన చ‌ర్చ‌లో ఈ మేరకు నిర్ణ‌యించారు.

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అనుకూలంగా లేక‌పోయినా.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై భారాలు మోప‌కుండా.. అదేస‌మ‌యం లో అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తూ.. బ‌డ్జెట్‌కు రూప‌క‌ల్ప‌న చేశార‌ని.. జ‌న‌సేన నాయ‌కులు, బీజేపీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా బీసీల సంక్షేమానికి, చిన్నారుల‌ విద్య‌కు భారీ నిధులు కేటాయించార‌ని.. కొనియాడారు. అలానే సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు కూడా నిధుల‌ను భారీగానే ప్ర‌కటించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఈ బ‌డ్జెట్ భ‌రోసా క‌ల్పిస్తుంద‌న్నారు.

ఇది.. ఒక ర‌కంగా బ‌డ్జెట్ కాద‌ని.. రాష్ట్ర అభివృద్ధికి, ప్ర‌గ‌తికి చిహ్న‌మ‌ని ప‌లువురు నాయ‌కులు వ్యాఖ్యానిం చారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు స్పందిస్తూ.. బ‌డ్జెట్‌లోని అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు కూట‌మి పార్టీలు ఐక్యంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. విధ్వం సం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని న‌డిపిస్తున్న ఈ బ‌డ్జెట్‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత వివ‌రంగా తెలియజేయా లన్నారు.

ర‌చ్చ‌బండ‌లు...

+ రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌పై న‌గ‌రాల్లో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని, మేధావుల‌ను, ఆర్థిక రంగ నిపుణుల‌ను ఈ స‌మావేశాల‌కు ఆహ్వానించి.. బ‌డ్జెట్‌లోని కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత స‌ర‌ళంగా వివ‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని నిర్ణ‌యించారు.

+ గ్రామీణ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత వివ‌రంగా బ‌డ్జెట్‌లోని అంశాల‌ను వివ‌రించేందుకు ర‌చ్చ‌బండ‌లు నిర్వ‌హించాల‌ని కూట‌మి నాయ‌కులు నిర్ణ‌యించారు. ఈ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాల‌కు మూడు పార్టీల నాయ‌కులు క‌ల‌సి క‌ట్టుగా రావాల‌ని.. ముఖ్యంగా చ‌దువుకున్న వారికి దీనిలో భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

Tags
ap budget nda alliance parties in ap projecting budget
Recent Comments
Leave a Comment

Related News